Movies

టక్ జగదీశ్ కథ ఇదే ….వర్కవుట్ అయ్యేనా ?

ఏదో ఒక లోపంతో ఉండే హీరో రోల్స్ బాగానే క్లిక్ అవుతున్నాయి. హరేరామ్ మూవీతో కళ్యాణ్ రామ్ ఎవరినీ నెంబర్ వన్ అంటే ఇష్టం ఉండదు. సహించలేడు. దీన్ని బైపోలార్ సమస్య తో బాధపడడం అంటారు. డబుల్ రోల్ లో నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, కళ్యాణ్ రామ్ కి మంచి పేరే తెచ్చింది. ఇక భలే భలే మాగాడివోయ్ మూవీతో మతిమరుపు పాత్రతో నేచురల్ స్టార్ నాని ఆకట్టుకున్నాడు.

ఇక శర్వానంద్ తో మహానుభావుడు డైరెక్టర్ మారుతి తీసిన మహానుభావుడు మూవీలో హీరో ఓసిడి సమస్యతో బాధపడేలా చూపించాడు. మారుతి ఇలాంటి చిత్రాలను వదిలేసి కొత్త రూట్ లో వెళ్తుంటే, నాని మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు. అందుకే శివ శర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టక్ జగదీశ్ లో బైపోలార్ పాత్రను నాని పోషిస్తున్నాడు.

సంతోషం గా ఉన్నా, బాధగా ఉన్నా ఎక్కువ రియాక్ట్ అవ్వడం బైపోలార్ సమస్య లక్షణం కూడా. గతంలో శివ శర్వాణ ,నాని కాంబోలో నిన్ను కోరే మూవీ వచ్చింది. ఇప్పుడు శివ జానర్ మార్చడం నానికి కల్సి వస్తుందా లేదా .. ఈ పాత్రలో ఒదిగిపోతాడా తేడా వస్తుందా అనేది చూడాలి.