రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కి కారణం ఇదే… అసలు నమ్మలేరు…కానీ ఇది నిజం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మగధీర తర్వాత ఇండస్ట్రీ హిట్ అందుకున్న మూవీ రంగస్థలం. 15సెంటర్స్ లో వందరోజులు పూర్తిచేసుకుంది. చెర్రీలోని నటుడిని ఆవిష్కరించిన మూవీ ఇది. అయితే పూర్తి పల్లెటూరి వాతావరణంలో సాగిన ఈ సినిమాలో హీరోకి చెవుడు,హీరోయిన్ సమంత డీ గ్లామరైజ్. ఇక విలన్ కూడా 1980ల కాలంనాటి గెటప్ తో విలన్ జగపతి బాబు. మరోపక్క డబ్బు ఎక్కువ ఖర్చు అవుతోంది. డైరెక్టర్ సుకుమార్ ఎందుకిలా మారాడు అనే చర్చ మూడేళ్ళ క్రితం ఈ మూవీ టైంలో నడిచిన చర్చ ఇది. ఫాన్స్ కి కూడా డైలమా. కానీ సుక్కు ఆలోచన ఎక్కడా లెక్కతప్పలేదు. పైగా ఊహించిన దానికన్నా ఎక్కువ హిట్ అయింది. రంగస్థలం అనే ఊరిలో విదేశాలనుంచి వచ్చిన అన్నయ్య అక్కడ ప్రెసిడెంట్ చేసిన అన్యాయాలను ప్రశ్నించి బలయ్యపోతాడు. ఇదంతా ఊళ్ళో బోర్లు బాగుచేసుకుని బతికే తమ్ముడికి తెలీదు. కానీ తెలుసుకున్నాక ఏంచేసాడన్నదే ఈ సినిమా స్టోరీ. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని అసలు హంతకుణ్ణి పట్టుకుంటాడు.
కథ పాతదే అయినా సుకుమార్ తన వైవిధ్యాన్ని ట్రీట్ మెంట్ లో చూపించాడు. 1980నాటి బ్యాక్ డ్రాప్ తో అదే తరహాలో తెరకెక్కించాడు. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మౌనిక దంపతులు ఈ సినిమాను డీల్ చేయడం గొప్ప విశేషం. గోదావరిలో పచ్చదనం కాకుండా బంగారుతనం చూపించాలని మండువేసవిలో షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే వర్షాలు కురిసి పచ్చగడ్డి రావడంతో మట్టి తీసుకొచ్చి ఎండుగడ్డి నాటిమరీ షూట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అక్కడి వాతావరణానికి తగ్గట్టు సెట్ వేశారు. సినిమా అనే భావన కాకుండా ఊరి మధ్య తిరుగుతున్న భావన కల్పించబట్టే రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ప్రెసిడెంట్ భూపతి లాంటి వ్యవస్థ, ప్రకాష్ రాజ్ ని విలన్ గా చూపించడం,రంగమ్మత్త, చిట్టిబాబు మధ్య హృద్యమైన బంధం ఇలా అన్నీ ఆకట్టుకునేలా తీసాడు.
చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటన,స్టూడియాలో విలేజ్ ఆర్ట్ వర్క్,కెమెరామన్ వేలు,దేవిశ్రీ సంగీతం,చంద్రబోస్ గేయాలు ఇలా అన్నీ రంగస్థలం మూవీకి కల్సివచ్చాయి. హీరో హీరోయిన్ కాకుండా అనసూయ ,ప్రకాష్ రాజ్,జగపతి బాబు ఇలా ఎవరికీ వాళ్ళు తమ పాత్రల్లో జీవించారు. ఒక్కో పాట విడుదల చేస్తూ మొత్తం 5సాంగ్స్ ని లహరి ద్వారా రిలీజ్ చేసారు. 2018మార్చి 30న వరల్డ్ వైడ్ 1700థియేటర్స్ లో రిలీజ్ చేసారు. తొలిరోజే వరల్డ్ వైడ్ 40కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చెన్నైలో తొలిరోజు 25లక్షల గ్రాస్ వచ్చింది. మొత్తం 85కోట్లు ఈ సినిమా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 58.55కోట్లు ఒక వారానికే తెలుగు రాష్ట్రాల్లో వసూలుచేసింది. బాహుబలి వన్, బాహుబలి టు తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిల్చింది. బాహుబలి,ఖైదీ నెంబర్ 150తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రంగస్థలం నిల్చింది. అమెరికాలో ఏప్రియల్ నాటికీ 1.3బిలియన్ డాలర్లు వసూలు చేసి అత్యధిక వసూళ్ళలో మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో వారం ముగిసే సమయానికి 165కోట్లు కలెక్ట్ చేసి ఖైదీ నెంబర్ 150ని అధిగమించింది. 45రోజులకు 125కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 93కోట్లు వచ్చేసింది. ఇప్పటికీ చెక్కుచెదరని మూవీ ఇది.