రెండు సినిమాల మధ్య చిచ్చు రేపిన రైటర్స్ పరుచూరి బ్రదర్స్ …ఏమిటా కథ చూడండి
కొన్నిసార్లు అనుకోకుండా వివాదాలు చుట్టుముడతాయి. స్టార్ హీరోల మధ్య కూడా ఇలాంటి అపార్ధాలు,వివాదాలు సహజమే. ఇందులో కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఓ ఘటన విషయంలోకి వెళ్తే, 1989లో బాలకృష్ణ ,ఎస్ ఎస్ రవిచంద్ర కాంబినేషన్ లో బాలకృష్ణుడు అనే మూవీ తీయడానికి నిర్ణయించారు. అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అప్పట్లో పేజీలకు పేజీలు యాడ్స్ కూడా వచ్చేవి. ఇది సెట్స్ మీదికి వెళ్లే సమయంలో ఆర్యన్ అనే ఓ మలయాళ మూవీని ప్రొడ్యూసర్స్ తిలకించారు.
ఈ మూవీ రీమేక్ చేస్తే ,బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని నిర్మాతలు భావించారు. విషయం చెప్పడంతో బాలయ్య ఒకే చేసాడు. దీంతో తెలుగు హక్కులను మూడు లక్షలకు ప్రొడ్యూసర్స్ కొన్నారు. అశోక చక్రవర్తి అనే పేరుతొ మూవీ తీయడం స్టార్ట్ చేసారు. దాంతో బాలకృష్ణుడు టైటిల్ పక్కకు పోయింది. అయితే ఆర్యన్ మూవీ కథ ఆధారంగా విక్టరీ వెంకటేష్ హీరోగా ధ్రువ నక్షత్రం మూవీ షూటింగ్ చేసారు. ఇంకో విశేషం ఏమిటంటే,ఈ రెండు మూవీస్ కి పరుచూరి బ్రదర్స్ పనిచేసారు. అలాగే 1989జూన్ 29న రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి.
అప్పటికే ముద్దుల మావయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో అశోక చక్రవర్తి విడుదలయింది. అయితే ధ్రువనక్షత్రం సూపర్ హిట్ అవ్వగా, అశోక్ చక్రవర్తి ప్లాప్ అయింది. దీంతో తాను మూడు లక్షలు పెట్టి హక్కులు కొంటె,అదే కథను కాపీ చేసి సినిమా తీస్తారా అంటూ ధ్రువనక్షత్రం మూవీ నిర్మాతను ప్రశ్నిస్తూ అశోక్ చక్రవర్తి నిర్మాత పేపర్ ప్రకటన కూడా ఇచ్చేసాడు. అలాగే రెండు చిత్రాలకు తెల్సి పనిచేసిన పరుచూరి బ్రదర్స్ ని కూడా సదరు నిర్మాత ఆ ప్రకటనలో ప్రశ్నించాడు. విషయం తెల్సుకున్న వెంకీ స్పందిస్తూ .. తనకు ముందే తెలుసుంటే ఈ సినిమా చేసేవాడను కానని చెప్పగా,బాలయ్య ఏమాత్రం స్పందించకపోవడంతో వివాదం సర్దుమణిగింది.