అపరిచితుడు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…మీకు తెలుసా ?
దేశంలో నెలకొన్న నిర్లక్ష్యం,అవినీతి అంతమొందించడానికి దేవుడు అవసరం లేదు. మనిషి చాలు అనుకున్న డైరెక్టర్ శంకర్ మదిలోంచి మెదిలిన సినిమాయే అపరిచితుడు. అమాయుకుడిగా, అల్ట్రా మోడల్,రెబెల్ ఇలా ఒకే మనిషి ప్రవర్తన ఉంటుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే రోగమే ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని రూపు మాపుతుంది. ఒకే మనిషి ముగ్గురిలా ప్రవరిస్తాడు. సమాజం పట్ల ప్రేమ, సమాజంలో అవినీతి జాడ్యంపై కోపం ఇలా రెండు కోణాలు చూపించాలి. అప్పటికే ఏడు మూవీస్ తీసిన డైరెక్టర్ శంకర్ ఎప్పుడూ పడని టెన్షన్ ఈ మూవీకి చూసాడు. సుజాతా రంగనాధం స్టోరీ అయితే రాసిచ్చాడు కానీ, స్క్రీన్ ప్లే రాయడానికి నాలుగు రేట్ల టెన్షన్ పడుతున్నాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరకు వెళ్లిన శంకర్ కి నిరాశ. ఇక విక్రమ్ దగ్గరకు వెళ్లడంతో ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ కుదరలేదు. సిమ్రాన్ ఖాళీలేదు. దీంతో సదాను అదృష్టం వరించింది. ఏ ఆర్ రెహ్మన్ ఖాళీలేక హరీష్ జైరాజ్ సంగీతం. పిసి శ్రీరామ్ ఖాళీలేక మణికందన్ కెమెరా. ఇక విక్రమ్ వైఫ్ శైలజ మానసిక శాస్త్రం చదవడం వలన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి విక్రమ్ తో చర్చ,మూడు పాత్రల్లో ఎలా ఉండాలి అనే దానిపై తీవ్రంగా కసరత్తు. ఇక శంకర్ కి నిద్రలేదు. 2004లో అపరిచితుడు లాంచింగ్. తమిళంలో అన్నియన్,హిందీలో అపరిచిత్, తెలుగులో అపరిచితుడు. ఈమూవీని ఆరునెలల్లో పూర్తిచేస్తామని శంకర్ చెప్పడంతో మీడియా వాళ్ళు ఆశ్చర్యంగా చూసారు.
పేరెన్నికన్నా సంగీత విద్వాంసుల మీద షాట్స్ తీశారు. హాలీవుడ్ నుంచి 120మంది మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు దిగారు. హాలీవుడ్ లెవెల్లో టేకింగ్. మద్రాసులో సెట్ ,హైదరాబాద్ గచ్చీబౌలి స్టేడియం లో పబ్లిక్ తో మాట్లాడే సీన్. నెదర్లాన్డ్స్ లో సాంగ్స్ షూటింగ్. అప్పటికే ఆరునెలలు పూర్తవడంతో ఇంకా షూటింగ్ ఉంది. మణికందన్ వేరే కమిట్ మెంట్ తో జంప్ అవ్వడంతో బెంగాలీ మూవీ అఫర్ వదిలేసి రవివర్మ వచ్చాడు. ఇక విక్రమ్ కి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే సినిమా అవ్వలేదు. ఓ రకంగా అపరిచితుడు మైకంలో ఉన్నాడు. గ్రాఫిక్స్,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కల్పి 26కోట్లు దాటేసింది. అయినా ప్రొడ్యూసర్ ఆస్కార్ రవిచంద్రన్ జడవలేదు. తెలుగులో లక్ష్మి గణపతి ఫిలిమ్స్ బాడిగ సుబ్రహ్మణ్యం ఆరు కోట్ల 77లక్షలకు కొన్నాడు. 2005జూన్ 12న 104ప్రింట్స్ తో రిలీజై డివైడ్ టాక్ తో సూపర్ హిట్ అయింది. మూడు క్యారెక్టర్స్ మార్చి మార్చి నటించడం ద్వారా విక్రమ్ అదరగొట్టేసాడు. భువనచంద్ర సాంగ్స్ అదుర్స్ . శంకర్ కన్న నిజమైతే సమాజం ఎంత బావుంటుందో కదా అని ఇప్పటికీ అనిపిస్తుంది. అంతలా ముద్రవేసింది ఈ మూవీ. 37సెంటర్స్ లో వందరోజులు ఆడేసింది. 15కోట్లు కలెక్షన్స్.