ఉపాసనతో చెర్రీ స్పెండ్ చేయలేక పోతున్నాడా… అంత కష్టంగా ఉందా ?
మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాక ఉపాసన పబ్లిక్ లైఫ్ ఎక్కువ గా కనిపిస్తున్న ప్పటికీ నిజానికి అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉపాసన చాలా పాపులర్. అడ్మినిస్టేటివ్ వింగ్ లో ఆరితేరింది. మెగా వారి కోడలు అయ్యాక ఫాన్స్ కి తెల్సింది. రామ్ చరణ్ , ఉపాసన లవ్ మేరేజ్ కావడంతో ఇద్దరి జోడీ సూపర్ గానే ఉంటుంది. సినిమాల్లో హీరోగా, ప్రొడ్యూసర్ గా చెర్రీ, హాస్పిటల్,సామాజిక వ్యవహారాల్లో ఉపాసన తమ తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు.
ఇక కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ మూతపడింది. కానీ వైద్యుల డ్యూటీ ఎక్కువ కనుక హాస్పిటల్స్ వేగంగా పనిచేస్తున్నాయి. అందుకే హాస్పిటల్ పనిలో ఉపాసన బిజీగా మారిపోతే , సినిమా షూటింగ్స్ లేకపోవడంతో చెర్రీ ఖాళీ అయ్యాడు. ఇంట్లో నుంచే హాస్పిటల్ వ్యవహారాలు ఆమె నడుపుతోంది. చెర్రీ కూడా ఇంట్లోనే ఉన్నా ఇద్దరూ సరదాగా గడపలేని పరిస్థితి.
చెర్రీ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు. కేసులు ఎక్కువ కావడంతో ఆమె ఇంటినుంచి బిజీగానే ఆసుపత్రి పనులు చక్కబెడుతోంది. కేవలం భోజనం సమయంలోనే ఉపాసనతో స్పెండ్ చేస్తున్నానని ,మిగిలిన సమయంలో మాట్లాడ్డానికి కూడా వీలు పడడం లేదని చరణ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే సామాజిక స్పృహ గల వైఫ్ దొరకడం ఆనందంగా ఉందని అంటున్నాడు.