అర స్పూన్ గింజలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Ajwain or Carom Seeds Benefits In Telugu : వాము అనేది ప్రతి ఒక్కరి వంట గదిలోనే ఉంటుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. వాము ఘాటుగా కాస్త కారంగా ఉంటుంది. మన అమ్మమ్మల కాలం నుండి వామును ఇంటి చిట్కా గా వాడుతున్నారు. కాస్త కడుపునొప్పి అనిపిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త వాముని నోట్లో వేసుకుని నమలండి అని చెబుతారు.
వాము తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడి కడుపు నొప్పి, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం వానలు వస్తున్నాయి కదా… ఈ వాన కాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి తరచుగా వస్తూ ఉంటాయి.
అలా వచ్చినప్పుడు వేడిపాలల్లో వాము పొడి కలుపుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తల నొప్పి కూడా తగ్గుతుంది. వాము లో ఉండే పోషకాలు గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేయడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే వాము లో విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటుంది.
కాబట్టి రోజువారి ఆహారంలో వామును చేర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వామును పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. వాము పొడిలో నీటిని కలిపి పేస్ట్ గా చేసి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే తలనొప్పి,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. వాము నీటిలో కొంచెం ఉప్పు కలిపి తాగితే వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి వాముకు ఉంది. ఆస్తమా నుండి ఉపశమనం కొరకు వాము,బెల్లం కలిపి తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.