Health

పురుషుల కంటే మహిళల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ… ఎందుకో తెలుసా?

ఇటీవల జరిగిన పరిశోధనల్లో పురుషుల్లో కంటే మహిళల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలిసింది. ప్రమాదకరమైన కణాలను నాశనం చేసే టి కణాలు మహిళల్లో ఎక్కువగా విడుదలవుతాయి. కరోనా బారిన మహిళల కంటే పురుషులు ఎక్కువగా పడటంతో ఈ అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. మానవ శరీరం లోకి కరోనా ప్రవేశించాక ప్రమాదకరమైన కణాలు తయారవుతాయి.

ఈ కణాలను ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థలో టి కణాలు కీలకమైన పాత్రను పోషిస్తాయని తెలిసింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో టి కణాలు అధికంగా విడుదలవుతాయి. పురుషులతో పోలిస్తే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల కరోనా ఎక్కువగా పురుషులకు వస్తుంది. కాబట్టి పురుషులు ఎక్కువగా జాగ్రత్త తీసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలి.