Movies

ప్రదీప్ సినిమా పరిస్థితి ఏమిటో… ఆ బాట తప్పదా?

టాలీవుడ్ లో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. బుల్లితెర నుంచి సుధీర్ వచ్చాడు. అలాగే ఎంతో మంది వచ్చారు వెళ్ళారు. ఇక ఈప్పుడు ప్రదీప్ వచ్చింది. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. వేసవిలోనే అవి మళ్ళీ ముందుకు రావాలి. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ మూత పడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. థియేటర్స్ ఓపెన్ చేస్తారు అని ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసిన ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేకపోవడంతో ఈ సినిమాను OTT లో లో రిలీజ్ చేస్తారని చాలా రోజుల నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయినా చిత్రయూనిట్ ఈ విషయంపై స్పందించలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా oTT లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో దర్శక నిర్మాతలు ఆ దిశగా ఆలోచన సాగిస్తున్నారు అట. OTT లో రిలీజ్ చేస్తే ప్రదీప్ అదిరిపోయే సక్సెస్ అందుకుంటాడు అని అభిమానులు భావిస్తున్నారు. ప్రదీప్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు.