Health

బ్యాటరీ తో నడిచే మాస్క్… ధరెంతో తెలుసా?

కొన్ని నెలల క్రితం వరకు మాస్క్ లను వైద్యులు, వైద్య సిబ్బంది, కొన్ని పనులు చేసే వారు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వలన ప్రతి ఒక్కరి జీవితంలో మాస్క్ ఒక భాగం అయిపోయింది. మాస్క్ లలో చాలా రకాలు ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయి. కొన్ని మాస్కులు ఒకరోజు వాడేవి… ఇక కొన్ని మాస్క్ లు వాష్ చేసుకుని వాడేవి. ఎలా వాడినా మాస్కులు వాడటంలో జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువే. తాజాగా ఒక కంపెనీ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మాస్క్ తయారు చేసినట్టు ఒక కీలకమైన ప్రకటనను విడుదల చేసింది.

ప్రస్తుతం ఉన్న మాస్కులతో పోలిస్తే ఈ మాస్క్ గాలిని ఫిల్టర్ చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంట. ఈ మాస్క్ లో బ్యాటరీ సహాయంతో పనిచేసే 2 ఫ్యాన్స్ ఉంటాయి. శ్వాసను తీసుకోవటానికి ఈ ఫాన్స్ సహాయపడతాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఈ మాస్క్ ను ఉపయోగించవచ్చు అయితే హానికరమైన క్రిములు ఈ మాస్క్ కు తాగితే ఆల్ట్రా వైలెట్ రేస్ వల్ల సులువుగా నాశనం అవుతాయి. ఈ మాస్క్ ధర మరియు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది