Movies

దూకుడు సినిమా వెనక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో దూకుడు మూవీకి ఉన్న క్రేజ్ వేరు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ అయ్యాడు. మహేష్ సోదరి మంజుల సాయంతో మహేష్ ని కల్సిన శ్రీను వైట్ల ఓ బ్లాక్ బస్టర్ తీస్తానని చెప్పేసరికి ఆపనిలో ఉండమని మహేష్ అనేశాడు. ఆస్థాన రైటర్ గోపీ మోహన్ తో కల్సి శ్రీను వైట్ల కసరత్తు స్టార్ట్ చేసాడు. తమిళం,హిందీ ఇలా చాలా మూవీస్ లోని లైన్స్ తీసుకున్నా వర్కౌట్ కాలేదు. ఈలోగా మంజుల కూతురు స్టడీ కోసం వెళ్లడంతో నమో వేంకటేశా తీసిన 14రీల్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట,అనిల్ సుంకర ప్రొడ్యూసర్స్ గా వచ్చారు. గోపి మోహన్ వచ్చి ఓ స్టోరీ లైన్ చెప్పేసరికి శ్రీను వైట్ల,మహేష్ బాబు కూడా ఒకే చెప్పేసారు.

మొత్తానికి మహాబలేశ్వర్ లో కూర్చుని 80శాతం కథ రెడీ చేసారు. లాస్ట్ 20శాతం ఇంకా బాగారావాలని కసరత్తు చేస్తున్నారు. అక్కడ శివాలయంలో కూర్చుని ఆలోచన చేసాడు. మొత్తానికి మహేష్ ని ఎమ్మెల్యే గెటప్ లో చూపిస్తే అనే ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్ నేత పి. జనార్ధన రెడ్డి ఎప్పుడూ వైట్ డ్రెస్ లో ఉంటూ మాస్ లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరణించినపుడు లక్షల్లో జనం వచ్చారు. ఆ ఘటన శ్రీను వైట్ల చెబుతుంటే ఇదేంటని మిగిలినవాళ్లు ఆశ్చర్యపోయారు. హీరో తండ్రి అంటే అలాంటి ఇమేజ్ గల లీడర్ అని చెప్పాడు. మొత్తానికి ఆ రాత్రంతా కూర్చుని కథ సెట్ చేసారు. మహేష్ బాబు ఒకే చేసాడు.

ఈ సినిమాకు డైలాగులు బాంబులు లాగ ఉండాలని చెప్పడంతో డైలాగ్స్ రాసేటప్పుడు కోన వెంకట్ ఎంటరయ్యాడు. దీంతో మంచి రంజుగా వచ్చాయి. ఇక కథ పూర్తికాకుండానే హీరోయిన్ గా సమంతను సెలెక్ట్ చేసేసారు. తండ్రి పాత్ర కోసం వేట మొదలుపెట్టారు. ప్రకాష్ రాజ్ ని పెట్టండి అని మహేష్ సూచనతో ఒకే చేసేసారు. ఇక టైటిల్ కోసం కసరత్తు. పవర్ అని పెట్టాలని ఆలోచన చేసారు. ఇక ఆ సమయంలోనే దూకుడు టైటిల్ అనేసుకున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం ట్రై చేస్తుంటే ఖాళీలేదు. ఈలోగా తమన్ వెయిటింగ్. మొత్తానికి ఒకే అయ్యాడు. హైదరాబాద్, బ్యాంకాక్ ,దుబాయి,తదితర చోట్ల మొత్తం 150రోజుల షూటింగ్. ఇందులో టాకీ పార్ట్ 50రోజులే. ఈలోగా వర్కర్స్ సమ్మె. 20నిమిషాల నిడివి తగ్గించినా 3గంటలు ఉంది. 2011సెప్టెంబర్ 23న రిలీజ్. ఉదయం ఆట చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఇది 80కోట్ల సినిమా అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నిజంగా ఈ మూవీ దూకుడుగానే దూసుకెళ్లింది.