‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
మాస్ మహారాజు రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ లో వేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కి మంచి గుర్తింపు వచ్చింది. బుజ్జి బుజ్జి మాటలతో అలరించింది. అయితే ఈమె తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె కూడా చిన్న వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి పెద్దయ్యాక హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పేరు లయ. విజయవాడకు చెందిన ఈమె భద్రం కొడుకో సినిమాతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వేసిన పాత్రకు నేషనల్ అవార్డు అందుకునే రేంజ్ కి ఎదిగింది.
ఎన్నో మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి, స్టడీస్ కోసం సినిమాలకు దూరంగా జరిగింది. ఈమె తల్లి టీచర్, తండ్రి డాక్టర్. చిన్నప్పటినుంచి డాన్స్ నేర్చుకున్న లయ మంచి డాన్సర్ కూడా. అంతేకాదు,నేషనల్ లెవెల్ చెస్ చాంపియన్ గా ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంది. ఇక కె విజయభాస్కర్ డైరెక్షన్ లో స్వయంవరం మూవీకి కొత్త హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతుంటే,పాల్గొన్న లయ సెలక్ట్ అయింది. హీరో వేణు తో జోడీ కట్టి తొలిసినిమా తోనే హిట్ అందుకుంది. హీరో వేణుకి కూడా ఇదే తొలిమూవీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతటి గుర్తింపు వచ్చిందో హీరోయిన్ గా కూడా అంతే గుర్తింపు వచ్చింది.
మావోహారం,మిస్సమ్మ, దేవుళ్ళు,హనుమాన్ జంక్షన్,ప్రేమించు,దొంగరాముడు అండ్ పార్టీ, నీ ప్రేమకై వంటి మూవీస్ లో లయ నటించింది. తెలుగులోనే కాదు,తమిళ, మలయాళం, కన్నడం భాషల్లో నటించింది. దాదాపు 30సినిమాల్లో చేసి,కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా ఒక ఎన్నారై ని పెళ్ళాడి అమెరికాలో స్థిరపడింది. వీళ్ళకి కూతురు శ్లోక,కొడుకు వచన్ వున్నారు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో హీరోయిన్ తల్లి పాత్రలో కన్పించింది. అయితే అదే సినిమాలో లయ కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ మూవీలో హీరోయిన్ ఇలియానా పాత్ర ప్రకారం అమెరికాలో పుట్టి పెరుగుతుంది. అందుకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నారై పాపను సెలెక్ట్ చేయాలని భావించి లయ ను సంప్రదించడంతో ఒకే చెప్పడం,నటించడం జరిగిపోయింది.