కాబోయే తల్లులు ఆనందంగా ఉండాలంటే….ఇవి తప్పనిసరి
గర్భం దాల్చిన సమయంలో చాలా మంది స్త్రీలు అనవసరమైన ఆందోళన,ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇది వారి ఆరోగ్యం మీదే కాకుండా గర్భస్త శిశువు యొక్క ఆరోగ్యం మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆ సమయంలో వారు ఆనందంగా ఉండటానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాము.
పోషకాహారం తీసుకోవటంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్,మద్యం వంటి అలవాట్లను పూర్తిగా మానివేయాలి.
విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. మాములు కన్నా ఒకటి రెండు గంటలు ఎక్కువ నిద్రపోవటం గర్భవతులకు చాలా ముఖ్యం.
బరువు పెరుగుతున్నారా? లేదా తగ్గుతున్నారా అన్నది వారం వారం పరిరక్షించుకోవాలి. బరువు పెరిగే క్రమం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి.
సాదారణంగా గర్భం దాల్చినప్పుడు హార్మోన్స్ లో మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా స్త్రీల అందం రెట్టింపు అవుతుంది. అలాకాకుండా చర్మం పొడిబారినట్లు ఉన్నా,కంటి క్రింద నల్లటి చారలు ఏర్పడినా అనారోగ్యం కిందే భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి.
మీ శరీర ఆకృతికి అనుగుణంగా దుస్తులను ధరించాలి. గర్భవతుల కోసం ప్రత్యేకంగా డ్రస్ లు దొరుకుతాయి. వాటిని మాత్రమే వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మాములు సమయంలో వాడిన విధంగా సౌందర్య సాధనాలను వాడకూడదు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి.