Banana Beauty tips: మిగలపండిన అరటిపండ్లు పారెయ్యకండి: ఇలా వాడితే ముఖానికి అందం, జుట్టుకు ఆరోగ్యం!!
Banana Beauty tips: మిగలపండిన అరటిపండ్లు పారెయ్యకండి: ఇలా వాడితే ముఖానికి అందం, జుట్టుకు ఆరోగ్యం..అరటిపండును అమృత ఫలం అని కూడా పిలుస్తారు. దీనికి ఒక కారణం ఉంది. రుచితో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు మందుగా ఉపయోగపడుట వలన దీనిని అమృత ఫలం అని అంటారు.
అయితే ఈ అమృత ఫలం రుచిగానే కాకుండా అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్య పరిరక్షణకు అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మొటిమలకు మంచి మందుగా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్స్,పోటాషియం చర్మానికి,జుట్టుకు పోషణను అందిస్తాయి.
అరటిపండులో చర్మానికి హాని చేసే పదార్దాలు ఏమి లేవు. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి ముఖానికి పట్టించి,అరగంట సేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుతాయి. మొటిమలలోని ఇన్ఫెక్షన్ ను అరటిపండులో ఉన్న పోటాషియం సమర్దవంతముగా ఎదుర్కొంటుంది. దీనిలోని బి విటమిన్ దురదను తగ్గించి చర్మానికి రంగుని,నిగారింపును తీసుకువస్తుంది.
ముఖం పై గీతలు కనపడుతూ ఉన్నాయంటే చర్మం పొడిగా మారుతుందని అర్ధం. అలాంటప్పుడు అరటిపండు గుజ్జులో,ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి,ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖ వర్చసు పెరుగుతుంది.
వాతావరణంలోని కాలుష్యం జుట్టుకి హాని కలిగిస్తుంది. దానికి తోడు బ్యాక్టీరియ కూడా వచ్చి చేరుతుంది. ఈ సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవుట,సహజమైన కాంతిని కోల్పోవటం జరుగుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవటానికి అరటిపండు గుజ్జును జుట్టు మొదళ్ళ నుండి చివరి వరకు బాగా పట్టించి అరగంట పాటు ఆరనిచ్చి,గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అప్పుడు జుట్టు పూర్వపు కాంతిని పొందటమే కాకుండా అందంగా మరియు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/