Beauty Tips

spectacle marks:కళ్ళజోడు మచ్చలతో ఇబ్బందిగా ఉందా…ఇలా చేస్తే నిమిషంలో మాయం అవుతాయి

Home remedies spectacle marks : కళ్ళజోడు పెట్టుకోవటం స్టైల్ గా ఉన్న సరే ముక్కు మీద మార్క్స్ పడతాయి. అయితే కొంతమంది కంటి చూపు కోసం కళ్ళజోడు వాడుతూ ఉంటారు. కొంతమందికి సైట్ ఎక్కువగా ఉండుట వలన కళ్ళజోడు ప్రతి రోజు పెట్టుకోవాల్సిందే. అలా పెట్టుకోవటం వలన కొన్ని సమస్యలు వస్తాయి.

ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు వాడే వారి ముక్కు చర్మం మీద పిగ్మెంటేషన్ మార్కులు వస్తాయి. అంతేకాక మనలో చాలా మంది కళ్ళజోడుకు ప్రత్యమ్నాయంగా కాంటాక్ట్ లెన్స్ వాడటానికి ఇష్టపడటం లేదు. అయితే కొన్ని ఇంటి నివారణల ద్వారా సహజ మార్గంలో ఈ మార్కులను తగ్గించుకోవచ్చు.
Potato
బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అందువలన కళ్ళజోడు నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. బంగాళదుంప రసాన్ని ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు. లేదా బంగాళదుంప ముక్కను ప్రభావిత ప్రాంతంలో రుద్దవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.

నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన కళ్ళజోడు మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ నీరు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం పిగ్మెంటేషన్స సమస్యలు మరియు కళ్ళజోడు మచ్చలను తగ్గిస్తుంది.
honey
నిమ్మరసంలో తేనెను కూడా కలపవచ్చు. ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. రెండింటిలో మీకు లభ్యం అయిన దాన్ని బట్టి చిట్కాను ఫాలో అవ్వండి. చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా కళ్ళజోడు మచ్చలను తొలగించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.