Beauty Tips

కలబంద ఎలా వాడితే అందమైన ముఖం సొంతమవుతుంది

ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. లేకపోతే కలబంద జెల్ మనకి మార్కెట్లో సులభంగానే అందుబాటులో ఉంటుంది. కలబంద ని ఎలా వాడితే ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందో తెలుసుకుందాం.

మొటిమల సమస్య వేధిస్తున్నప్పుడు ముల్తాన్ మట్టి లో కలబంద గుజ్జు వేసి బాగా కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే తగ్గిపోతాయి

చర్మం పొడిగా ఉంటే కలబంద గుజ్జు రోజ్ వాటర్ కలిపి రాస్తే చర్మం తేమగా మారుతుంది

కలబంద గుజ్జులో కొబ్బరి నూనె కలిపి మోచేతులు పాదాల వద్ద నల్లగా మారిన చర్మం పై రాస్తే నలుపు తగ్గి చర్మం లో కలిసిపోతుంది.

అలోవెరా జెల్ లో సెనగ పిండి కలిపి రాస్తే ముఖం మీద ఉన్న జిడ్డు అంతా తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది.