Cracked foots:పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు
Cracked foots:పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు.. శీతాకాలం, వేసవి కాలం రెండింటిలోనూ అరికాళ్లు పగుళ్లు ఏర్పడటం సాధారణం. వాతావరణం మారినప్పుడు మనిషి పాదాల పగుళ్లు సహజంగా జరిగే ప్రక్రియ. స్త్రీలు లేకుండా పురుషులు కనిపించే ఈ సమస్య కొందరికి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
చలికాలం వచ్చిందంటే పాదాలలో తేమ తగ్గి పొడి ఎక్కువయ్యి పగుళ్లు వస్తాయి. ఈ పగుళ్ళను నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంది. కొద్దిగా శ్రద్ధ పెడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు
ఒక స్పూన్ ముల్తానా మట్టిలో నాలుగు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పాదాలకు రాసి అరగంటయ్యాక చల్లని నీటితో కడుక్కుంటే పాదాల పగుళ్లు సమస్య తగ్గుతుంది
రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ రోజ్ వాటర్ లో అర స్పూన్ గ్లిజరిన్ కలిపి పాదాలకు రాసి మసాజ్ చేయాలి. రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాలుగు రోజులపాటు చేస్తే పాదాల పగుళ్లు మాయం అయ్యి మృదువైన పాదాలు సొంతం అవుతాయి
గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఆ నీటిలో పాదాలను ఉంచి పదినిమిషాలయ్యాక చల్లని నీటితో కడగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/