బిగ్ బాస్ దివి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బిగ్ బాస్ ప్రారంభం అయ్యింది బుల్లితెరలో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు రోజురోజుకీ అంచనాలు పెంచేసింది. ఈసారి బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ దివి గురించి తెలుసుకుందాం. మొదట్లో చాలా స్లో గా ఉన్న దివి ఆ తర్వాత తాను ఏమిటో చూపించింది. మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించింది. అనేక వెబ్ సిరీస్ లో నటించింది. దివి పూర్తి పేరు దివి విద్య. కాలేజీలో ఉన్నప్పుడే మిస్ స్మైల్ గా ఎంపికైంది. బీటెక్ అయ్యాక మోడలింగ్ వైపు అడుగులు వేసింది.
ఈ హైదరాబాద్ అమ్మాయి అనేక యాడ్స్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. దివి నాన్న సెంట్రల్ యూనివర్సిటీ లో ల్యాబ్ టెక్నీషియన్. అమ్మ ప్రొఫెసర్. దివి కొంతకాలం క్రితం ఒక వ్యక్తిని ప్రేమించింది. అతనితో బ్రేకప్ కావడంతో కాస్త మానసికంగా ఇబ్బంది పడింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది. హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది.