నంది అవార్డ్స్ గురించి ఈ నమ్మలేని నిజాలు మీ కోసమే
సినిమాల్లో ఉత్తమ నటన కనబరిచినందుకు ,ఉత్తమ సినిమాలకు,ఉత్తమ గేయ రచయితలకు,గాయకులకు ఇలా అన్ని విభాగాల్లో ప్రభుత్వం తరపున అవార్డులు ఇవ్వడానికి 1977లో నంది అవార్డులు ప్రవేశ పెట్టింది. మొదట్లో ఈ అవార్డు తీసుకోవడం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉండేది. రానురాను రాజకీయాలు ఇందులో కూడా దూరాయి. విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2017లో నంది అవార్డుల ప్రకటన ఎంతటి దుమారం రేపిందో చెప్పక్కర్లేదు. అప్పటి నుంచి అవార్డులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నంది అవార్డులు ఆగిపోయాయి.
1977లో అమరదీపం మూవీకి బెస్ట్ యాక్టర్ గా రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈ అవార్డు అందుకున్నారు. మళ్ళీ బొబ్బిలి బ్రహ్మన్నకు అందుకున్నాడు. 2016లో నాన్నకు ప్రేమతో మూవీకి గాను జూనియర్ ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకున్నాడు. ప్రేమ,ధర్మచక్రం , గణేష్,కలిసుందాం రా,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీస్ కి గాను ఐదుసార్లు నంది అవార్డుని విక్టరీ వెంకటేష్ అందుకున్నాడు. నెంబర్ వన్ గా ఇప్పటికీ నిలిచాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు సినిమాలు అంటే నిజం,అతడు,దూకుడు ,శ్రీమంతుడు మూవీస్ కి ఉత్తమ నటుడు అవార్డు అందుకుని సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
స్వయంకృషి,ఆపద్భాంధవుడు,ఇంద్ర మూవీస్ మెగాస్టార్ చిరంజీవి; నరసింహ నాయుడు,సింహ,లెజెండ్ మూవీస్ కి బాలకృష్ణ; అన్నమయ్య, శ్రీరామదాసు ,సంతోషం మూవీస్ కి నాగార్జున; స్వాతిముత్యం,సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు మూవీస్ కమల్ హాసన్;గాయం,మనోహరం, మావిచిగురు మూవీస్ కి జగపతి బాబు మూడేసి సార్లు అవార్డులు అందుకున్నారు. మేఘసందేశం,బంగారు కుటుంబం మూవీస్ రెండుసార్లు అక్కినేని;మామగారు,మేస్త్రి మూవీస్ కి రెండు సార్లు దాసరి;ఎర్ర మందారం, ఆ నలుగురు మూవీస్ కి రాజేంద్రప్రసాద్ రెండుసార్లు నంది అవార్డు పొందారు మిర్చి మూవీతో ప్రభాస్; బావాబావమరిది మూవీతో సుమన్; నేనింతే మూవీతో రవితేజా, ఏటో వెళ్ళిపోయింది మనసు మూవీతో నాని ఒక్కొక్కసారి అవార్డు అందుకున్నారు. 1993లో జగపతి బాబు,సుమన్ జాయింట్ గా, అలాగే 2002లో చిరు,నాగ్ కల్సి పంచుకున్నారు.నటరత్న ఎన్టీఆర్,సూపర్ స్టార్ కృష్ణ,అందాల నటుడు శోభన్ బాబు లకు ఒక్కసారి కూడా నంది అవార్డు రాకపోవడం విశేషం. ఇక ఆతర్వాత మోహన్ బాబు,డాక్టర్ రాజశేఖర్ లకు నంది అవార్డు రాలేదు.