Kitchenvantalu

క్రంచీ కిట్‌ క్యాట్ (KIT KAT CHOCOLATE )

కావలసినవి:
డార్క్ చాక్లెట్ 50 గ్రా,మిల్క్ చాక్లెట్ 50 గ్రాములు,వేఫర్స్- 6 (మార్కెట్లో దొరుకుతాయి)

తయారి:
ముందుగా చాక్లెట్ ను కరిగించాలి. దాని కోసం పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో నీరు పోసి మరిగించాలి. ఇప్పుడు వేరొక చిన్న గిన్నె తీసుకోని దానిలో చాక్లెట్ ముక్కలను వేసి ఆ గిన్నెను నీరు పోసి మరిగిస్తున్నగిన్నెలో పెట్టి చాక్లెట్ కరిగే వరకు ఉంచాలి. అంటే చాక్లెట్ ను డబుల్ బాయలింగ్ చేస్తున్నాము.

ఈ విధంగా డార్క్ చాక్లెట్,మిల్క్ చాక్లెట్ రెండింటిని కరిగించుకోవాలి. డార్క్ చాక్లెట్ ను మిల్క్ చాక్లెట్ మిశ్రమంలో కలపాలి. వేఫర్ ఆకారంలో ఉన్న అచ్చును తీసుకోవాలి. దానికి అన్ని పక్కల కవర్ అయ్యేటట్లు సన్నటి పొరగా మిశ్రమాన్ని పోయాలి. దీనిపై వేఫర్‌ను పెట్టి నెమ్మదిగా నొక్కి ఇంకా కొంత చాక్లెట్ మిశ్రమాన్ని మొత్తం అన్ని వైపులా కవర్ అయ్యేలాగా పోయాలి.

ఇలా తయారుచేసుకున్న చాక్లెట్స్ ను ఫ్రీజర్‌లో 10 నిమిషాలు ఉంచాలి. అంతే పిల్లలు ఇష్టంగా తినే క్రంచీ కిట్‌ క్యాట్ రెడీ. డార్క్ చాక్లెట్,మిల్క్ చాక్లెట్స్ ముక్కల రూపంలో సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది.