1983లో విడుదలైన చిత్రాలు….ఎన్ని హిట్స్…. ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి
1983 Hit Telugu Movies : టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ సీఎం గా ఎన్నికవ్వగా, చిరంజీవి ఖైదీ సినిమాతో హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చు కున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తన సత్తా చాటాడు. అయితే 54 సినిమాలు ఈ ఏడాది ప్లాప్ అయ్యాయి. ఇక అమరజీవి,సింహం నవ్వింది,రాజ్ కుమార్,బెజవాడ బెబ్బులి భారీ అంచనాలతో వచ్చి ప్లాప్ అయ్యాయి.
13సినిమాల్లో హీరోగా చేసి అందులో 9మూవీస్ హిట్స్ కొట్టాడు సూపర్ స్టార్ కృష్ణ హీరో ఆఫ్ ది ఇయర్ అయ్యాడు. ఆరు సినిమాలతో హిట్స్ కొట్టి,సాగర సంగమంతో జయప్రద ఫిల్మ్ ఫేర్ సాధించింది. ఇక టాప్ టెన్ హిట్స్ చూస్తే నెంబర్ వన్ ముందడుగు. కృష్ణ ,శోభన్ బాబు నటించిన ఈ మూవీ 15సెంటర్స్ లో 100రోజులు , 2కేంద్రాల్లో 75రోజులు ఆడింది. ఇక ఖైదీ మూవీ చిరంజీవి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. 6సెంటర్స్ లో 100రోజులు ఆడి, ఒక సెంటర్ లో షిఫ్ట్స్ తో 300రోజులు ఆడింది.
కృష్ణ నటించిన కిరాయికోటిగాడు 5డైరెక్ట్ సెంటర్స్ లో 100రోజులు ఆడింది. టి కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన నేటిభారతం సంచలన విజయాన్ని అందుకుంది. షిఫ్ట్ మీద 17సెంటర్స్ లో 100రోజులు,ఒక డైరెక్ట్ సెంటర్ లో 175డేస్ ఆడింది. ఇక అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీరంగ నీతులు 5డైరెక్ట్ కేంద్రాల్లో 100రోజులు ఆడింది.
సూపర్ కృష్ణ మరో ప్రభంజనం శక్తి 3కేంద్రాల్లో 100రోజులు ఆడడం ద్వారా సూపర్ హిట్ అయింది. ఇక అద్భుత కథ, కథనాలు,కమల్ హాసన్ నటన, జయప్రద అభినయం, విశ్వనాధ్ దర్శకత్వం వెరసి సాగర సంగమం షిఫ్ట్స్ 17కేంద్రాల్లో 100రోజులు ఆడింది. 3షిఫ్ట్ కేంద్రాల్లో 175డేస్ ఆడింది.
ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న చిరంజీవి మగమహారాజు 4డైరెక్ట్ కేంద్రాల్లో 100రోజులు ఆడి,సూపర్ హిట్ అయింది. ఇక కృష్ణ ,కృష్ణంరాజు మల్టీస్టారర్ అడవి సింహాలు మూవీ తొలివారం రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టి, 2సెంటర్స్ లో డైరెక్ట్ గా వందరోజులు ఆడి, సూపర్ హిట్ అయింది.
ఇక కృష్ణ ప్రజారాజ్యం మూవీ భారీ అంచనాలతో విడుదలై,50రోజులవరకూ సంచలన విజయంగా నడిచి,రెండు డైరెక్ట్ సెంటర్స్ లో వందరోజులు ఆడింది. ఇక 33డబ్బింగ్ మూవీస్ రాగా అందులో ప్రేమసాగరం సినిమా మంచి విజయాన్ని అందుకుని ,300,450రోజులు కూడా ఆడింది. ఇక కమల్ నటించిన సాగర సంగమం క్లాసిక్ మూవీగా నిల్చింది. బెంగుళూరులో 500రోజులు ఆడడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేటి భారతం మూవీతో విజయశాంతికి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చింది.