ఉదయ్ కిరణ్ హీరో అవ్వటానికి కారణం అయినా వ్యక్తి ఎవరో తెలుసా ?
అదృష్టం తలుపు తడితే జరగాల్సింది జరిగిపోతుంది. అదృష్టవంతుడిని పాడుచెయ్యలేం, దురదృష్టవంతుడిని బాగుచెయ్యలేం అనే సామెత ఉండనే ఉంది. కెమెరామెన్ గా ఉండే తేజ డైరెక్టర్ గా అవతారం ఎత్తడానికి చాలా కష్టపడ్డాడు. ఎప్పుడో 1991లో చిత్రం మూవీ కథ రాసుకుంటే, కారణాలు ఏమైతేనేం 2000సంవత్సరంలో మూవీగా వచ్చిందని గతంలో తేజ ఓ ఇంటర్యూలో చెప్పాడు.
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తీసిన చిత్రం మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాతోనే ఉదయ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ కి సినీ బ్యాక్ గ్రౌండ్ ఏమీలేదు. ఆడిషన్స్ కి వచ్చిన ఉదయ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలక్ట్ అయ్యాడట. అయితే అనుకోకుండా హీరోగా సెలక్ట్ అయిన కుర్రోడు రాకపోవడంతో ఉదయ్ ని హీరో వేషం వరించిందట. నిజానికి ముందు అనుకున్న కుర్రాడు ఒకే అయివుంటే ఉదయ్ కి హీరో ఛాన్స్ వచ్చేది కాదన్నమాట.
తేజ డైరెక్టర్ గా ఉదయ్ హీరోగా వచ్చిన చిత్రం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. అనుకోకుండా రెండవ సినిమా కూడా వీరిద్దరి కాంబినషన్ లోనే నువ్వు నేను మూవీ వచ్చి అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆతరవాత ఎం ఎస్ రాజు తీసిన మనసంతా నువ్వే మూవీ సైతం బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఉదయ్ స్టార్ హీరోగా రాణించాడు. తర్వాత విధి పరిస్థితుల్లో ఈలోకం నుంచి దూరమయ్యాడు.