శనీశ్వరునికి నువ్వుల నూనెతో ఎందుకు అభిషేకం చేస్తారో తెలుసా?
అత్యంత శక్తివంతమైన దోషాలు కూడా నివారించగల శక్తి నువ్వులకు ఉన్నది. ఆ నువ్వుల ద్వారా వచ్చిన నూనెని తైలము అందురు. తిలల ద్వారా వచ్చినది కనుక తైలము అనబడును.
నవగ్రహాలలో శక్తివంతమైన దోషం గల గ్రహం శని కనుక ఆ శని దోషాన్ని కూడా నివారించగల శక్తి నువ్వులకి, నువ్వెల నూనెకి ఉన్నది. కావున ఈ తైలంతో శనికి అభిషేకం చేస్తే శనిదోష నివారణ అగును. శని అనుగ్రహం కలిగి సుఖిస్తారు.