గాంధీ వేషంలో ఉన్న స్టార్ హీరోని గుర్తు పట్టారా … వెంటనే చూసేయండి
ఎప్పుడో ఇంగ్లీషులో గాంధీ సినిమా వస్తే, దాన్ని అన్ని భాషల్లోకి తర్జుమా చేసారు. అందులో గాంధీగా ఆంగ్ల నటుడే నటించాడు. అయితే చాలా సినిమాల్లో గాంధీ పాత్రలు పాత సినిమాల్లో చూపించేవారు. రేపటి పౌరులు వంటి సినిమాలో కూడా టి కృష్ణ చిన్న పిల్లల చేత దేశనాయకుల వేషాలు వేయించి రక్తి కట్టించారు. ఇక స్కూల్స్ లో కూడా ఆగస్టు 15, గాంధీ జయంతి వంటి వేడుకల్లో చిన్న పిల్లల చేత గాంధీ ,తదితర దేశ నాయకుల వేషాలు వేయించేవారు.
ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అయితే ఇలా చిన్నప్పుడు గాంధీ వేషాలు వేసిన వాళ్ళల్లో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఇలాంటి ఫోటోలను సెలబ్రిటీలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలాగే ఈ గాంధీ జయంతి సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. ఇందులో కొందరు గాంధీజీ సూచించిన మార్గాలను పాటించాలంటూ ఆయన సూక్తులను, మరి కొందరు గాంధీజీ రేర్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇక కొందరు చిన్నప్పుడు తాము వేసిన గాంధీ వేషం ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, మాస్ హీరో, కూడా అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాను చిన్నప్పుడు గాంధీ వేషం వేసుకున్న ఫొటోను షేర్ చేశాడు. అలాగే ఈ మాస్ హీరో కూడా తాను వేసుకున్న గాంధీ వేషంను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడంతో విశేషంగా వైరల్ అయింది. నిజానికి గుర్తుపట్టలేం కూడా. అంతలా క్యూట్ గాంధీ గా ఉన్నాడు. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను నటించి సినిమాలో సమంత , తమన్నాతో రొమాన్స్ చేశాడు. తర్వాత జయ జానకీ నాయక వంటి సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు.