రియల్ లైఫ్ లో డాక్టర్స్ … రీల్ లైఫ్ లో యాక్టర్స్ …ఎంతమంది ఉన్నారో ?
కొందరు నిజంగా వైద్య శాస్త్రం చదివి డాక్టరయినవాళ్లు ఉన్నట్లే , మరికొందరు ఏమీ చదవకపోయినా అద్భుతాలు సాధించి గౌరవ డాక్టరేట్ అందుకుని తమ పేరు ముందు డాక్టర్ తెచ్చుకున్న వాళ్ళూ ఉన్నారు. అలాగే డాక్టర్ గా ఉంటూ కొన్నాళ్ళు వైద్యం చేసి, తర్వాత యాక్టర్ గా మారిన వాళ్ళు, యాక్టర్ గా ఉంటూ కూడా వైద్యం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు,సూపర్ స్టార్ కృష్ణ నటించిన డాక్టర్ సినీ యాక్టర్ మూవీ చూస్తుంటే డాక్టర్ గా, యాక్టర్ గా కృష్ణ మెప్పించిన తీరు సూపర్. అసలు విషయానికి వస్తే, మన ఇండస్ట్రీలో కూడా చాలామంది వైద్యం చదివి యాక్టర్, స్టార్ హీరోలు అయినవాళ్లున్నారు. హీరోయిన్స్ లో కూడా వైద్యం చదివిన వాళ్ళున్నారు.
ఇందులో ముఖ్యంగా అలనాటి మేటి హాస్య నటుడు డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో పతి వైద్యంలో ఆరితేరారు. ఆయన పేరుతొ రాజమండ్రిలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కాలేజీ నడుస్తోంది. ఈయన మెగాస్టార్ చిరంజీవికి స్వయానా పిల్లనిచ్చిన మామగారు. వెయ్యికి పైగా సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ మదిని దోచుకున్నారు. ఇక హీరో డాక్టర్ రాజశేఖర్ వైద్య వృత్తి చేస్తూ డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటూ సినిమాల్లోకి వచ్చి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అప్పట్లో దూసుకెళ్లారు. నటి జీవితను పెళ్లాడిన యితడు తన కుమార్తెలను హీరోయిన్స్ గా పరిచయం కూడా చేసాడు. ఇక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య కూడా ఎంబిబిఎస్ మధ్యలో ఆపేసి నటిగా కొనసాగింది. మాంచి ఫామ్ లో ఉండగా విమాన ప్రమాదంలో మరణించింది. రంగం సినిమా లో సీఎం పాత్ర వేసి ,అద్భుతమైన విలనిజం పండించిన అజ్మల్ అమీర్ వైద్య శాస్త్రం చదివి, నటనతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.
ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రాణాల మదిని గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. గుండె సంబంధిత వైద్య నిపుణురాలిగా పని చేస్తోంది. సినిమాల్లో మంచి పాత్రలను ఎంపిక చేసుకుని గ్లామర్ కన్నా,నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా మూవీస్ లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న భరత్.. ఇప్పుడు పెద్దైన తర్వాత డాక్టర్ చదివాడు. రెండేళ్లలో వైద్యుడిగా మారిపోతాడు. అదేవిధంగా లిటిల్ సోల్జర్స్ మూవీలో అల్లరి నటనతో ఆకట్టుకున్న కావ్య ఇప్పుడు డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేస్తోంది. ఇక కరోనా కారణంగా ఓటిటిలో రిలీజైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన వాళ్లకు రూప కొడువయూర్ కళ్ళముందు మెదులుతుంది.
సెకండాఫ్‌లో వచ్చే ఈ భామ స్వతాహాగా డాక్టర్ మాత్రమే కాదు మంచి డాన్సర్ గా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. నటుడు భరత్ రెడ్డి అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ స్పెషలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాలు, రాజకీయాల్లోనే కాదు వివిధ వృత్తుల్లో కూడా వారసత్వం ఉంటుంది. అదేవిధంగా తన తల్లిదండ్రులు డాక్టర్స్ కావడంతో ప్రణీత కూడా ఆ రంగం వైపు వెళ్లి, డాక్టర్ చదివి, హీరోయిన్ అయింది. ఇక ప్రముఖ మలయాళ నటి దివ్య నాయర్ కూడా హోమియో డాక్టర్ గా రాణిస్తోంది. అలాగే తెలుగులో చంద్రహాస్ లాంటి సినిమాలు చేసిన హరనాథ్ పొలిచెర్ల కూడా డాక్టర్.