Health

ఈ అంకెలు ఏం చెబుతాయో తెలుసా!

రోజుకో పండు ఆరోగ్యానికి మేలు.. రోజుకో యాపిల్ తినండి డాక్టర్ అవసరం లేదు.. పిల్లలకు పండ్లపై రయిమ్స్ రూపంలో చెబుతూ ఉంటాం. ఈ కాలంలో అన్నం కంటే.. ఫ్రూట్స్ తిని బతికేస్తున్నవారు ఎందరో. డైలీ లైఫ్ లో పండ్లు ఎంతో కీలకం అయ్యాయి. ఇంట్లో కూరగాయల బడ్జెట్ కంటే.. పండ్లకు పెట్టే ఖర్చు రోజురోజుకు పెరిగిపోతుంది. మరి అలాంటి ఫ్రూట్స్ క్వాలిటీ విషయంలో చాలా మంది అవగాహన తక్కువ.

ఏ మాల్ కు వెళ్లినా.. ఏ సూపర్ మార్కెట్ లో చూసినా.. రోడ్లపై బండ్లపైన అయినా ప్రతి ఫ్రూట్ పై ఓ స్టిక్కర్ కనిపిస్తోంది. ఆ స్టిక్కర్ పై నంబర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ పై అంకెలు ఏం చెబుతున్నాయి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కొన్నామా.. స్టిక్కర్ తీసేసి తిన్నామా వరకే పరిమితం. ఆ స్టిక్కర్లపై ఉండే సంఖ్యలలో ఏయే సంఖ్యలు ఏయే వివరాలను తెలియజేస్తాయో చూద్దాం.

3 లేదా 4 అంకెతో ప్రారంభమైతే…
పండ్లపై వేసే స్టిక్కర్లపై నాలుగు అంకెల సిరీస్ ఉండి.. ఆ నంబర్ 3 లేదా 4తో
ప్రారంభమైతే ఆ పండ్లు కృత్రిమ రసాయనాలు, సహజ సిద్ధ ఎరువులు వాడి పండించారని అర్థం. సాధారణంగా అలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లను 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా, నూతన పద్ధతులను ఉపయోగించి పండించారని చెబుతోంది.

9 అంకెతో ప్రారంభమైతే…
పండ్లపై వేసే స్టిక్కర్లపై ఐదంకెల సిరీస్ ఉండి.. ఆ నంబర్ 9తో ప్రారంభమైతే ఆ పండ్లను పూర్తిగా సేంద్రీయ ఎరువులు ఉపయోగించి.. అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం. ఇవి మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవి. మంచి క్వాలిటీ అని చెబుతోంది.

8 అంకెతో ప్రారంభమైతే…
పండ్లపై వేసే స్టిక్కర్లపై ఐదంకెల సిరీస్ నంబర్ ఉండి.. ఆ నంబర్ 8తో ప్రారంభమైతే ఆ పండ్లు జన్యు మార్పిడితో పండించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లను ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇవి ప్రమాదకరం కూడా. అనారోగ్యాలను కలిగిస్తాయి.

సో.. ఇక నుంచి మీరు పండ్లు కొనేటప్పుడు వాటిపై స్టిక్కర్స్ ఉంటే.. ఏ అంకెతో ప్రారంభం అయ్యాయో చూసుకుంటారా..