Movies

మన హీరోల 25 వ సినిమాల పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే ?

హీరోలకు వంద రోజుల సినిమా, 175 రోజుల సినిమా , 300రోజులు ఇలా ఒకప్పుడు రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం వలన కలెక్షన్స్ మీద దృష్టి మారిపోయింది. ఇక గతంలో ఏడాదికి అరడజను, డజను సినిమాలు కూడా చేసిన హీరోలున్నారు. ఇప్పుడు ఏడాదికి ఒకటి కూడా రావడం లేదు. అందుకే 25సినిమాలు పూర్తిచేయడం గగనం అవుతోంది. మన హీరోల 25వ సినిమా ఆడాలని చాలామంది కోరుకుంటున్నా అది కొందరికి నెరవేరడం లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ మూవీస్ అయినా ఎక్కువ రేంజ్ , ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక భారీ అంచనాల నడుమ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి తీరని వేదన మిగిల్చింది. దారుణంగా డిజాస్టర్ అయింది. తర్వాత రాజకీయాల్లో చేరి, జనసేన పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా వ్యవసాయం ప్రధాన అంశంగా వచ్చిన మహర్షి మూవీ మంచి రిజల్ట్ అందుకుంది. ఇక గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీతో హిట్ కొనసాగిస్తూ , సర్కార్ వారి పాట మూవీకి రెడీ అవుతున్నాడు.

ఇక సుకుమార్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీ మంచి హిట్ కొట్టింది. దీంతో తారక్ కెరీర్ లో 25వ సినిమా ఒక తీపి గుర్తుగా మిగలడమే కాదు, అక్కడ నుంచి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. నేచురల్ స్టార్ నాని నెగెటివ్ రోల్ లో చేసిన వి మూవీ ఓటిటిలో రిలీజై తేడా కొట్టింది. ఇది 25వ సినిమా కావడం విశేషం. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన 25వ మూవీ పంతం హిట్ కాకపోవడం బాడ్ లక్. అలాగే నితిన్ 25వ మూవీ చల్ మోహన్ రంగ మూవీ హిట్ అందుకోలేక పోయింది.