మహాభారత కాలంలో పన్నులు ఎలా వసూలు చేసేవారో తెలుసా..?
నల్ల కుబేరులు, అవినీతి పరులను పట్టుకునేందుకు… లేదంటే ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు ఇప్పుడు ఐటీ అధికారులు ఉన్నారు. మరి… చాలా వెనుకటి రోజుల్లో అంటే… రామాయణం, మహాభారతం కాలాల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేందుకు ఎవరైనా సిబ్బంది ఉన్నారా..? అసలు అప్పట్లో పన్నులు వసూలు చేశారా..? అంటే చేశారు..! కానీ ఇప్పుడున్నట్టు కాదు, ఒక్కో రోజు తన రాజ్యంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేసేవారు. అయితే కొన్ని సందర్భాల్లో రాజోద్యోగులు కాకుండా ఏకంగా రాజులే పన్నులు వసూలు చేసేందుకు వెళ్లేవారు. అందుకు మహాభారతంలోని ఈ సంఘటనే ఉదాహరణ..!
మహాభారతంలోని దిగ్విజయ పర్వం (అధ్యాయాలు 25 నుంచి 31 వరకు) ప్రకారం పాండవులు తమ రాజ్య విస్తరణకు, అభివృద్ధికి పెద్ద ఎత్తున ధనం కావల్సి రావడంతో రాజసూయ యాగం చేయడం ప్రారంభించారట. ఈ క్రమంలో ధర్మరాజు తన నలుగురు తమ్ములైన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడులను రాజ్యానికి నాలుగు ఈ క్రమంలో వారు అనేక రాజులను కలిసి తమ కార్యక్రమం వివరిస్తారు. అందుకు ఆ రాజులు ఒప్పుకుని ధనమిస్తే సరే, లేదంటే వారిపై యుద్ధం చేసి అందులో గెలిచి ధనాన్ని సాధించేవారు. అలా నలుగురూ నాలుగు దిక్కులకు వెళ్లి ఎంతో ధనాన్ని యాగం కోసం తెస్తారు. ఈ క్రమంలో దక్షిణం వైపు ఉన్న లంకకు సహదేవుడు వెళ్లాల్సి వస్తుంది.
అయితే అక్కడుండేది అంతా రాక్షసులే కావడంతో వారికి సరైన ధైర్యవంతుడు ఘటోత్కచుడని చెప్పి సహదేవుడు అతన్ని లంకకు పంపిస్తాడు. అప్పుడు లంకా నగరాన్ని రావణుడి తమ్ముడు విభీషణుడు పాలిస్తుంటాడు.భీముడు తూర్పుకు, అర్జునుడు ఉత్తరానికి, నకులుడు పడమరకు, సహదేవుడు దక్షిణం దిక్కుకు ప్రయాణమై వెళ్తారు.
విభీషణుడంటే పాండవులు ఉన్న ద్వాపర యుగానికి ముందు త్రేతాయుగం వాడు. అయినా అన్ని సంవత్సరాల పాటు లంకా నగరాన్ని ఎలా పరిపాలిస్తూ ఉన్నాడంటే… అతనికి రాముడు వరం ఇస్తాడు. రావణున్ని చంపాక అతని తమ్ముడు విభీషణున్ని లంకకు పట్టాభిషిక్తున్ని చేసిన రాముడు అనంతరం అతనికి లెక్కకు మించిన ఆయుష్షును ప్రసాదిస్తాడట. అందుకే విభీషణుడు అన్ని కాలాలు, యుగాలు మారినా లంకను ఏలుతూనే ఉంటాడు.
అయితే విభీషణుడు లంకను పాలిస్తున్న సమయంలో ద్వాపర యుగంలో అలా ఘటోత్కచుడు సహదేవుడి ఆజ్ఞ మేరకు లంకకు వెళ్తాడు. ఈ క్రమంలో ఘటోత్కచున్ని గుర్తు పట్టిన విభీషణుడు, వారికి (అంటే పాండవులకు), శ్రీకృష్ణునికి (పూర్వ అవతారంలో రాముడు) మధ్య ఉన్న స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని ఘటోత్కచునికి లెక్క లేనంత ధనాన్ని సమర్పిస్తాడు. అలా పూర్వకాలంలో పన్నును వసూలు చేసే వారన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదుగా… ప్రభుత్వ ఉద్యోగులే పన్నులు వసూలు చేస్తున్నారు..!