Health

ఇంట్లో ఉండే ఈ 10 వస్తువులకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?

కొన్ని ఏళ్ల తరబడి వాడుతున్న వస్తువు ఏదో ఒకటి ప్రతీ ఇంట్లో ఉంటుంది. స్టీల్ గిన్నెలు, ఇత్తడి సామాన్లు కాకుండా సాధారణంగా అన్ని ఇళ్ళల్లో లభించే కొన్ని వస్తువులకి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈ విషయాని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు ఆ వస్తువులని తెగ వాడేస్తుంటారు. ఇప్పుడు మీరు ఊహించని కొన్ని వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకోండి..!

* సరైన తలగడ లేకుంటే మంచి నిద్రని కోల్పోతాం. కొన్ని సార్లు మెడ నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి తలగడని ప్రతి రెండు సంవత్సరాలకి మార్చాలి.

* ఇంట్లో లేదా ఇంటి వద్ద ధరించే చెప్పులకు అధిక శాతంలో బాక్టీరియా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా వాష్ చేసినా సరే… ప్రతి ఆరు నెలలకి వీటిని మార్చండి.

* పచ్చిగా ఉన్న టవల్స్ పై బాక్టీరియా త్వరగా పెరుగుతుంది. కాబట్టి టవల్స్ ని వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. అలాగే ఒక టవల్ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు.

* మనం రోజు వాడే టూత్ బ్రష్ ని కనీసం మూడు నెలలకి ఒకసారి మార్చాలి.

* లోదుస్తులను సంవత్సరానికి ఒకసారి మార్చాలి.

* రెగ్యులర్ గా వాడే జాగింగ్ షూస్ ని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు. వాటిలో ఉన్న కుషనింగ్ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్ పెయిన్స్ వస్తాయి.

* హ్యాండ్ సానిటైజర్ బాటిల్ ని ఒక్కసారి తెరిచాక మూడు నెలలకన్నా ఎక్కువ పనిచేయదు. దాని పవర్ తగ్గిపోతుంది.

* పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఓపెన్ చేసిన తర్వాత కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే పని చేస్తాయి.

* దువ్వెనని ప్రతి వారం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక దువ్వేనని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు వాడకూడదు.

* బాడీ స్పాంజ్/షవర్ పఫ్ ని నిత్యం వేడి నీటిలో శుభ్రం చేయాలి. అలాగే వీతిన్ ఇఆరు నెలల కన్నా ఎక్కువ రోజులు వాడకూడదు.