karivepaku podi:’కరివేపాకు పొడి’ వలన ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
karivepaku podi benefits :కూరలో కరివేపాకు వేస్తే ఆ రుచి అద్భుతం. అలానే కరివేపాకు వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. ఇది తెలిసినా కూడా.. కూరలో కరివేపాకుని పక్కన పెట్టి తినడం అందరికీ అలవాటు.
కరివేపాకు వలన ఉపయోగాలు:
1: చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో ఉన్నవారు అయినా.. కరివేపాకు తినడం వలన ముఖ్యంగా జీర్ణ వ్యవస్థని శుభ్ర పరిచి.. జీర్ణ వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది.
2: కరివేపాకు ఆకులు వెంట్రుకలను దృడంగా, మృదువుగా మారతాయి. జుట్టు రాలటాన్ని తగ్గించి, తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
3 : కరివేపాకులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట వరం. అదెలా అంటే.. తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్ గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని గుర్తించారు నిపుణులు.
4: జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
5: ప్రతిరోజూ ఉదయం 10 కరివేపాకుల చొప్పున 3 నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటారు ఆయుర్వేద వైద్యులు.
6: శరీరంలోని రక్త హీనతను తగ్గిస్తుంది.
7: లివర్ చెడిపోకుండా రక్షిస్తుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది.
8: చర్మ వ్యాధులు రాకుండా చేసి.. ఉన్న చర్మ వ్యాధులను నివారిస్తుంది.
ఇది తెలిసినా కూడా.. కూరలో కరివేపాకుని పక్కన పెట్టి తినడం అందరికీ అలవాటు. మరి కరివేపాకుని అలా తినలేని వారు.. ఎలా తినాలి? అని పెద్దలు అలోచించి మనకు మంచి వంటకం రూపంలో అందించారు. అదే ‘కరివేపాకు పొడి’. ఇది ఎప్పటి నుండో వాడకంలో ఉన్నా.. నేడు మారిన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో కరివేపాకు వాడుక తగ్గి పోయింది. మరి కొద్దిగా కష్టపడి ఈ పొడి ఎలా చేసుకోవాలో చూదాం.
కావలసిన పదార్ధాలు:
కరివేపాకు : 1 కట్ట
పచ్చిశనగపప్పు : 1/2 కప్పు
వెల్లుల్లి రెబ్బలు : 12 పెద్దవి లేక 20 చిన్నవి
పచ్చిమిరపకాయలు : 4 లేక 5
మెంతులు : 1/2 టీ స్పూన్
జీలకర్ర : 1 టీ స్పూన్
చింతపండు : సరిపడినంత
ఆవాలు : 1/2 టీ స్పూన్
నూనె : 1 టేబుల్ స్పూన్
మిరియాలు : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
ఇంగువ : చిటికెడు
కరివేపాకు పొడి తయారీ విధానం:
మొదట పాన్ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పచ్చిశనగపప్పు, మిరియాలు, చింతపండు వేసి చిన్న మంట మీద వేయించాలి. పచ్చిశనగపప్పు రంగు రాగానే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోతున్నాయని అనిపించినప్పుడు.. కరివేపాకు, ఇంగువ వేసి కరివేపాకు బాగా వేగేవరకూ వేయించాలి. కరివేపాకును ముట్టుకుంటే విరిగిపోయేంత వరకూ వేయించాలి. ఉప్పు వేసి వేపి దానిని చల్లార్చి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిలో ఏమైనా ఉప్పు తగ్గితే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు.
ఇక పిల్లలు అన్నంలో కరివేపాకు ఏరిపారేస్తారన్న భయం లేకుండా వుండాలంటే.. అన్ని కూరల్లో కరివేపాకు పొడిచేసి వేస్తే సరి.. పిల్లలు ఆకలిగా లేదంటూ అన్నం చూడగానే ముఖం తిప్పేస్తుంటే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలుట. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.