అవినాష్ కి ఎవరు ఊహించని బంపర్ ఆఫర్
Bigg Boss Telugu Avinash :బిగ్బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేస్తున్న అవినాష్ చాలా తక్కువ సమయంలో నే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అవినాష్ మొదట జబర్దస్త్ లో అనేక టీమ్ లలో పనిచేసే ఆ తర్వాత టీం లీడర్ అయ్యాడు. బిగ్ బాస్ కి అడుగు పెట్టిన తర్వాతే అవినాష్ గురించి అందరికీ ఎక్కువగా తెలిసింది. జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కి రావటానికి బిగ్బాస్ నిర్వాహకులకు 10 లక్షలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. బిగ్బాస్ నుంచి వచ్చాక జబర్దస్త్ షో కి తీసుకో మని నిర్వాహకులు చెప్పారని అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు.
అయితే అవినాష్ బిగ్ బాస్ షోలో కి రావటానికి ముందే జీ తెలుగులో ప్రసారం అవుతున్న బొమ్మ అదిరింది షోలో ఆఫర్ దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలి లో నవిస్తు ముందుకు సాగుతున్నాడు.