జబర్దస్త్ వర్ష గురించి నమ్మలేని నిజాలు మీకోసమే
jabardasth varsha Facts :ఈటీవీలో టాప్ టిఆర్పి రేటింగ్ తో నడుస్తున్న జబర్దస్త్ కామెడీ షోలో కంటెస్టెంట్స్ తమ స్కిట్స్ తో జనాన్ని అలరిస్తూ మంచి పేరుతొ పాటు ఆర్ధికంగా కూడా ఎదిగారు. సినిమాల్లో కూడా చేస్తూ పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్ వంటివాళ్ళు హీరోలు కూడా అయిపోయారు.
బుల్లితెరమీద మిగిలిన షోస్ లో కూడా చేస్తూ సుడిగాలి సుధీర్ టివి రంగంలో సత్తా చూపిస్తూ ,నటుడిగా వెండితెరపై మెరిశాడు. అయితే ఈ షోలోకి అమ్మాయిలను తీసుకురాలేదు. మగవాళ్లే మహిళల పాత్రలతో దున్నేస్తూ వచ్చారు. అయితే ఆమధ్య చమక్ చంద్ర ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. మూడేళ్లు వేసింది.
అయితే తాజాగా హైపర్ ఆది టీమ్ లోకి వర్ష అనే అమ్మాయి వచ్చి వరుస స్కిట్స్ చేస్తోంది. ఈమె అసలు పేరు మానసి. అభిషేకం, తూర్పు మడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటించింది. అయితే జబర్దస్త్ లో తన అందంతో నటనతో మాయ చేస్తోంది. ఈ క్రేజ్ ఆమె కెరీర్ ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.