అధిక బరువు ఉన్నవారు బంగాళాదుంప తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
weight loss tips in telugu: బంగాళాదుంప అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. బంగాళదుంపతో ఏ కూర చేసినా మంచి రుచిగా ఉంటుంది. గ్రేవీ వంటల్లో వేసినా FRy చేసినా రుచిలో మాత్రం తేడా ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది. బంగాళదుంపలో క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
మనలో చాలా మంది బంగాళదుంప తింటే బరువు పెరుగుతామని తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది ఒక అపోహ మాత్రమే. బంగాళదుంప తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.
దాంతో తీసుకునే ఆహారం తగ్గుతుంది. బంగాళాదుంప కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్ విడుదల చేసి కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. బంగాళాదుంపలో పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన జీవక్రియ రేటును పెంచుతాయి. శరీరంలో కొవ్వు కణాలను తగ్గిస్తుంది.
అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బంగాళదుంపలో ఉండే మెగ్నీషియం, కాల్షియం కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బంగాళాదుంపలు అన్నీ కాలాల్లోనూ విరివిగానే లభ్యం అవుతాయి. అయితే బంగాళదుంపను ఉడికించి లిమిట్ గా తీసుకుంటేనే ఈ ప్రయోజనం కనబడుతుంది.
బంగాళాదుంపను ఎక్కువగా తీసుకున్నా… అలాగే వేపుళ్లు, చిప్స్ తీసుకున్నా బరువు పెరిగే ఛాన్స్ ఉంది…కాబట్టి ఉడికించిన బంగాళాదుంప తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఏదైనా లిమిట్ దాటితే అనర్ధమే కదా…ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ మన శరీరానికి అందాలంటే సరైన మోతాదులోనే తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.