Junnu:కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గించే జున్ను… మరెన్నో లాభాలు కూడా..!
Health benefits Of Junnu :ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారి కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి.
అప్పుడే మనం ఏ పని చేయాలన్నా నొప్పులు లేకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కాల్షియం, విటమిన్ డి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఇవి సమృద్దిగా లభించే ఆహారం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే చాలా రుచిగా ఉండే జున్ను ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.
జున్నులో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. జున్ను తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా మలబద్ధకం తగ్గుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండే జున్నును తగిన మోతాదులో తీసుకుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. దాంతో రోజంతా హుషారుగా ఉంటారు. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.