MoviesTollywood news in telugu

ఆగిపోయిన పవన్ సినిమాలు…కారణం ఏమిటో తెలుసా ?

pawan kalyan movies :మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుని పవర్ స్టార్ అయ్యాడు. చేసినవి తక్కువే అయినా ఇమేజ్ మాత్రం చాలా వచ్చింది. ఇక పవన్ ఒప్పుకున్న సినిమాలు చాలా వరకు పూర్తి కాలేదు. కొన్ని సెట్స్ మీదికి కూడా రాలేదు.వివిధ కారణాల వలన మరో 12 సినిమాలు ఆగిపోయాయి.

పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా చెప్పాలని ఉంది సినిమాను సూర్య మూవీస్ ప్లాన్ చేసింది. అయితేనువ్వే కావాలి పేరుతో అదే సినిమా తెరకెక్కించడంతో పవన్ సినిమా నిలిచిపోయింది. జానీ తర్వాత మరోసారి దర్శకత్వం చేయాలని పవన్ రాసుకున్న కథ సత్యాగ్రహి మూవీని కూడా ఏఎం రత్నం నిర్మాతగానే అట్టహాసంగా మొదలై… సెట్స్‌పైకి వెళ్లకుండానే నిలిచిపోయింది.

అప్పట్లో ఏసుక్రీస్తు జీవితంపై పవన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు జీసెస్ క్రైస్ట్ పేరిట ఓ సినిమా ప్లాన్ చేసాడు. ప్రకటన వరకే వచ్చి ఆగిపోయింది. దేశభక్తి నేపథ్యంలో తాను సొంతంగా కథ రాసుకుని దేశీ పేరుతొ పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటే, ఎందుకో కుదరలేదు. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని లారెన్స్ చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నం ఇప్పటికీ ఫలించలేదు.

నీసన్ దర్శకత్వంలో తమిళనాట హిట్టైన వేదాళం సినిమా తెలుగులో రీమేక్ చేయాలనుకున్న పవన్ స్టార్టు చేసాక ఆపేసారు.ఇక మాస్ దర్శకుడు వినాయక్ చాలా ఏళ్లుగా పవన్ సినిమా కోసం చూస్తున్నా, ఇంకా కార్యరూపం దాల్చలేదు. రాయలసీమ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కోబలి సినిమా చేయాలనుకుంటే కుదరక, చివరకు అదే కథను చేంజ్ చేసి, జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత చేసినట్లు టాక్.

కాటమరాయుడుకి ముందు ఎస్‌జే సూర్యతో పవన్ ఓ సినిమా స్టార్ట్ చేసినా, కానీ సెట్స్‌పైకి వెళ్లలేదు. పవన్, వెంకటేష్ చేయాల్సి న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ అనుకోకుండా పవన్ తప్పుకోవడంతో మహేష్ బాబు ఎంటరయ్యాడు. చాలా ఏళ్లుగా ఖుషీ 2 చేయాలనుకుంటున్న పవన్ ఆ మధ్య ప్రకటన కూడా చేసినా ఇంకా రాలేదు.