Tollywood:అక్కినేని విలన్ క్యారెక్టర్ చేయకపోవటానికి కారణం ఎవరో తెలుసా ?
Tollywood Hero Akkineni nageswara rao movies :తెలుగు సినిమా ఇండస్ట్రీకి నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లులాంటి వారని అంటారు. దుర్యోధనుడు, రావణాసురుడు వంటి విలన్ పాత్రల్లో సైతం ఎన్టీఆర్ నటించి మెప్పించారు.
కానీ అక్కినేని ఎన్ని చిత్రాలు చేసినా ఎక్కడా విలన్ పాత్రలు వేయలేదు. 1940లో ధర్మపత్ని మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేనికి మనం మూవీ ఆఖరి చిత్రం.అక్కినేని వారసులంతా నటించిన మనం మూవీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.
అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు విలన్ ఛాన్స్ లు వచ్చినా సరే, ఆయన వేయలేదు. ‘నా పర్సనాలిటీ కి, నా గొంతుకకు విలన్ వేషం వేస్తె అసలు బాగోదు. జనం కూడా రిసీవ్ చేసుకోలేరు. అందుకే అలాంటి పాత్రల జోలికి పోలేదు’ అని అక్కినేని చెప్పేవారు.
కానీ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్, గోపీచంద్, శ్రీకాంత్, శ్రీహరి.. ఇలా ఎందరో విలన్ వేషాలు వేసి మెప్పించి రానురాను హీరోలు అయ్యారు. అలాగే హీరోలుగా వేసిన జగపతి బాబు, అరవింద్ స్వామీ, కార్తీక్, అర్జున్ , సుమన్ వంటి వాళ్ళు విలన్స్ గా కూడా చేసి మెప్పిస్తున్నారు.