ఒకే రోజు..ఒకే టైంలో పుట్టిన.. టాలీవుడ్ స్టార్స్ ఎంత మంది ఉన్నారో?
Telugu Actress Sai pallavi :సినిమాల్లో డ్యూయల్ రోల్ వేయడం హీరో,హీరోయిన్స్ కి చాలా కష్టమైన పని. రెండు పాత్రలు తెరపై పండకపోతే ఆడియన్స్ తిరస్కరిస్తారు. అందుకే ఇలా నటించే వాళ్లతో పాటు సాంకేతిక నిపుణులకు కూడా రెండు పాత్రలను చూపించడం కష్టమైన పని. తేడా వచ్చిందంటే ప్లాప్. ఇలా డిజాస్టర్ అయిన సినిమాలే కాదు, డ్యూయెల్ రోల్స్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీస్ కూడా ఉన్నాయి. ఇక రియల్ లైఫ్ లో కూడా డబుల్ యాక్షన్ లో కన్పించిన స్టార్ హీరోస్ ఉన్నారు.
ఫిదా సినిమాలో తన తెలంగాణ యాసతో అదరగొట్టేసి, స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సాయిపల్లవి తెలుగులోనే కాదు,తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటోంది. తనకు ఓ చెల్లి ఉందని, ఆమె తాను కవల పిల్లలమని, తమ తల్లి సత్యసాయి భక్తురాలు కావడంతో తమ పేర్ల ముందు సాయి అని వస్తుందని ఓ ఇంటర్యూలో ఈ భామ చెప్పింది.
సాయిపల్లవి చెల్లెలు పేరు పూజా పల్లవి. పూజా కూడా మలయాళ సినిమాల్లో చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రామ్ లక్ష్మణ్ లను చూస్తే, వీళ్ళు కూడా ట్విన్స్ . టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ గా ఎందరో స్టార్ హీరోలకు స్టైలిష్ గా ఫైట్స్ కంపోజ్ చేసిన రామలక్ష్మణ్ లు మంచి పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో రౌడీ గ్యాంగ్ లు గా జూనియర్ ఆర్టిస్టులుగా కన్పించారు. వీళ్ళు ట్విన్స్ ని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక డైరెక్టర్స్ ధర్మ , రక్ష కూడా ట్విన్స్. ఎందరో స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిసిస్టెంట్ గా చేసిన వీళ్ళు మొదటిసారిగా చందమామ రావే సినిమాకు డైరెక్ట్ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.