‘కార్తీకదీపం’ డిసెంబర్ 14 ఎపిసోడ్…ఉత్కంఠగా మారిన కథ!మిస్ కావద్దు
karthika deepam serial 14Th :ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ నా కూతురికి కవితల మీద ఇంట్రెస్ట్ పెరిగిందని అందుకే నేర్పించడానికి తీసుకు వెళుతున్నాం అని అంటాడు.అప్పుడు ఆదిత్య మేము రెండు రోజుల తర్వాత యాదగిరిగుట్ట కి వెళ్దామని అనుకుంటున్నాము రెండు రోజుల్లో వచ్చేస్తుంది కదా అన్నయ్య మాతో పంపుతావా అని అడుగుతాడు అప్పుడు కార్తిక్ రెండు రోజులు ఏంటి నాలుగు రోజులు ఉంటుంది అక్కడ అని అంటాడు అప్పుడు ఆదిత్య పరవాలేదు అన్నయ్య నాలుగు రోజుల తర్వాత మేము వెళతాము అప్పుడు పంపిస్తావు కదా అంటాడు ఆ తర్వాత శ్రావ్య దీప గుర్తుకొస్తే అని అంటుంది అప్పుడు కార్తీక్ దీప గుర్తుకు వస్తే నువ్వే వెళ్లి చూపించి తీసుకురా శ్రావ్యా అని అంటాడు. ఆ తర్వాత హిమ మీరు అప్పుడు అప్పుడు వస్తూ ఉండండి నానమ్మ తాతయ్య అని చెబుతుంది అప్పుడు కార్తీక్ ఎందుకు అమ్మా నీకు డిస్టబెన్స్, నువ్వు ప్రశాంతంగా నేర్చుకో నువ్వు అనుకున్నది పూర్తవ్వాలని చెప్పి దేవుడి గదిలో దండం పెట్టుకుని బయలుదేరుతా అని అంటాడు
ఈలోపు దీప వాళ్ళ ఇంట్లో బట్టలు కుడుతూ అలా బాధగా ఉంటుంది అలాగే కంగారు పడుతూ ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు తెచ్చుకుంటుంది.కార్తీక్ తనతో హిమ గురించి చర్చించిన కొన్ని విషయాలను గుర్తు తెచ్చుకుంటుంది ఆ సమయంలో పొరపాటున తన వేలు ని కట్ చేసుకుంటుంది.అప్పుడు సౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అమ్మా అని చెప్పి చూసేసరికి వేలు నుండి రక్తం కారుతుంది అప్పుడు వెంటనే ఒక గుడ్డ ముక్కతో కట్టు కడుతుంది.
ఇప్పుడు జాకెట్లు కుట్టడం అంత అవసరమా అని సౌర్య దీప మీద అరుస్తుంది. లేదమ్మా నేను హిమ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది దీప అప్పుడు సౌర్య హిమ వస్తుంది అన్న అప్పటినుండి నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉన్నా వ్.అంతగా ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మ అని అంటుంది ఆలోచన కాదమ్మా భయం చాలా భయంగా ఉంది అంటుంది మళ్లీ అదే మాట అని సౌర్య అంటుంది. నువ్వు ఎందుకు అలా భయపడుతున్నావు అని సౌర్య అడిగితే దీప ఇలా ఉంటుంది డాక్టర్ బాబు తిరిగి వచ్చినప్పటినుండి చాలా ప్రేమగా నాన్న అని పిలుస్తుంది కదా అందువల్ల డాక్టర్ బాబు కి అనుమానం వచ్చింది.ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు నేను కార్ లో కూర్చోమని చెప్పి నన్ను నిలదీశారు నాన్న అని ఎందుకు పిలుస్తుంది నువ్వేం చెప్పావు అని కానీ నేను అప్పుడు ఏం చెప్పలేదు నేను ఎలాగైనా తెలుసుకుంటాను అని చెప్పి వెళ్లిపోయారు అక్కడినుండి డాక్టర్ బాబు.
ఒకవేళ డాక్టర్ బాబు కి నిజం తెలిసిన ఏమవుతుంది అమ్మ అని సౌర్య అడిగితే ఒకవేళ డాక్టర్ బాబు నిజం తెలిస్తే నిన్ను నన్ను ఎలాగైతే దూరంపెట్టారు అలానే హిమను కూడా దూరం పెడతారు అని అంటుంది. ఒకవేళ నిజం తెలిసి ఇక్కడే శాశ్వతంగా వదిలి వెళ్ళడానికి తీసుకొస్తున్నారా అని కంగారు పడుతుంది. మనసులో మౌనిత కానీ ఏమైనా చెప్పే అవకాశం ఉందా ఎందుకంటే మౌనితకు తప్ప ఎవరికి చెప్పే అవసరం అవకాశం ఎవరికీ లేదు అని మనసులో అనుకుంటుంది.
హిమ అసలు మన ఇంటికి వస్తానని అడగలేదట డాక్టర్ బాబు అడిగిమరీ తీసుకొస్తున్నారు అంట అని అంటుంది. ఈ లోపు భాగ్యం వాళ్ళింట్లో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆయన వచ్చి భాగ్యం నేను తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటాడు ఇప్పుడు మొక్కు కోడానికి వెళ్తున్నారా అని అడుగుతుంది అదేంటి అలా అడుగుతున్నావ్ అంటే ఎలాగో మొక్కు తీర్చుకునే అవకాశం లేదు కాబట్టి అయితే కొత్తగా మొక్కు కోవడానికి వెళ్ళాలి మీరు అని అంటుంది అదే నాకు అర్థం కాలేదు అంటే నువ్వు ఏమనుకుంటావో జీవితం బాగుండాలని కదా నువ్వు ముక్కోటి దేవతలు కు మొక్కుకున్నా ఒక్కరూ ఏమీ చేయలేకపోయారు మరి మళ్ళీ మొక్కు కోవడం తప్ప నువ్వు ఏం చేయగలవు అని అంటుంది వెళ్ళు వెళ్ళు అని అంటుంది.అయితే నేను ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకున్నాను అంటే నాకు కూడా రిజర్వేషన్ చేయించవా అని అంటుంది నువ్వెందుకు పిల్లిలాగా అంటే నువ్వు ఎలాగైనా అను నేను కూడా వస్తాను అంటుంది . మా అల్లుడు గోల్డ్ మీ అల్లుడు రోల్డుగోల్డు అని అంటుంది అప్పుడు మా అల్లుడు కూడా బంగారమే అని అంటాడు వాళ్ళ ఆయన కాకపోతే ఒక్క అనుమానం ఉంది అంటాడు. అదొక్కటే చాలదు ఏంటి జీవితాలు నాశనం చేయడానికి అంటుంది.
ఈ లోపు కార్తీక్ హిమకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఒక ప్రశ్న అడుగుతాడు వంటలక్క మనం కాదు కదా మంచి క్వాలిటీ అలానే మంచి కూరగాయలను వాడడేమో అని అంటాడు అప్పుడు హిమ కోపంగా ఆగు నాన్న అలా ఏముండదు అసలు అయినా ఎవరు … అంటే అప్పుడు కార్తీక్ అవును ఎవరు అని అడుగుతాడు అప్పుడు మీ భార్య కద నాన్న అంటే ఒక డాక్టర్ భార్య అలా చేయొదు అని అంటుంది.
ఈ లోపు సౌందర్య దేవుడి గదిలో అంతా బాగా జరగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది. కార్తీక్ ఇంకా అనుమానంతో బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు.ఆ తర్వాత దీప వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ దోసకాయ చూసి దోసకాయ పచ్చడి చేస్తున్నావ్ అంటే శౌర్య కి ఇష్టం కదా అందుకే చేస్తుంది అని అంటుంది నాకు మా వంటలక్క చేస్తేనే ఇష్టమా అని అంటుంది వాటర్ తాగుతారని వాటర్ బాటిల్ ఇస్తే వద్దు అంటాడు డాక్టర్ బాబు పోనీ కాఫీ తాగుతారా అని అడిగితే తాగి వచ్చాను అని అంటాడు.
కూర్చోమని అంటే కూర్చొను అని అంటాడు అప్పుడు దీప ఏదోరకంగా కూర్చో పెడుతుంది సరే ఇప్పుడు విషయానికి వస్తాను అంటాడు డాక్టర్ బాబు నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లో నువ్వు ఉన్నావు కదా అప్పుడు హిమ తో ఏవో కథలు చెప్పావు అంట కదా అని అంటాడు. అదే కవిత నేర్పావంట కదా అని అంటాడు. అందుకే ఇప్పుడు నాలుగు రోజులు ఇక్కడ ఉంచుతున్నాను కవితలు నేర్పించు అని అంటాడు ఇప్పుడు కవితలు ఎందుకు అంటే నువ్వు నేర్పించావు కదా అందుకే నేర్పించి ఇప్పుడు కూడా అని అంటాడు.
ఏమని ఇక్కడికి తీసుకు రావాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని దీప అడుగుతుంది.నా కూతురికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కాబట్టి ఇకపై తనని బాధ పెట్టకూడదు అని ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు అప్పుడు దీప విచిత్రంగా ఉంది నా కూతుర్ని నాకు దానం చేయండి మీరు ఇలా వాగ్దానం చేసుకున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది.
కార్తీక్ దీపకు డబ్బులు ఇస్తాడు. దీప వద్దంటుంది ఆ మాత్రం నాలుగు రోజులు నేను హిమను జాగ్రత్తగానే చూసుకోగలను. అప్పుడు కార్తిక్ నా బాధ్యతగా నేను అడుగుతున్నాను మరి అంత బాధ్యత లేకుండా ఉండలేను కదా అని అంటాడు. ఎంత నేను ఒక బిడ్డకి తల్లి ని ఆమాత్రం ఖర్చు పెట్టగలను అని అంటుంది.అప్పుడు డాక్టర్ బాబు ఎప్పుడైనా అవసరమైతే మొహమాటపడకుండా అడుగు ఎంత కావాలన్న ఇస్తాను అని అంటాడు అప్పుడు దీప నేను అడిగేది ఒక్కటే నా సౌభాగ్యాన్ని నాకు తిరిగి ఇవ్వమని అని అంటుంది ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది.