మోనాల్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ తెలుగులో సీజన్ 4 ప్రారంభం అయ్యి రోజు రోజుకి ఆదరణ పెంచుకుతూ చివరి దశకు చేరుకుంది. ఒక వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం మోనాల్ ఎలిమినేట్ అయింది. ఆమె దాదాపుగా 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. మొదట్లో ఆమె 2 లేదా 3 వారాల పాటు ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ చాలా రోజులు ఉండిపోయింది.
గుజరాతీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇంత కాలం హౌస్ లో ఉండటానికి కారణం ప్రేక్షకులా లేదా బిగ్ బాస్ అనేది ఎవరికి తెలియని ప్రశ్న. ఇప్పటివరకు ఆదరించి ఓటు వేసినందుకు థాంక్స్ చెప్పే ఈ భామ వెళ్లిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మోనల్ కి బిగ్ బాస్ ఎంత పారితోషికం ఇచ్చారో అని హడావిడి ప్రారంభం అయింది. ఆ విషయానికి వస్తే మోనాల్ కి రోజుకి 30000 చొప్పున 98 రోజులకు దాదాపుగా 29 లక్షల 60 వేల రూపాయిలు బిగ్ బాస్ పారితోషికం గా వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.