నిశ్చితార్ధం అయ్యాక క్యాన్సిల్ అయిన సెలబ్రిటీల పెళ్లిళ్లు
Tollywood Celebrities : పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. ఇక , నిశ్చితార్ధం అంటే సగం పెళ్లి అయినట్లే. కానీ మన సెలబ్రిటీల పెళ్లిళ్లు నిశ్చితార్ధం అయ్యాక కూడా ఆగిపోయినవి ఉన్నాయి. కారణం ఏమైనా ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరొందిన ఉదయ్ కిరణ్ ని అల్లుడు చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి నిశ్చితార్ధం కూడా జరిపించారు.
ఉదయ్, సుస్మిత ఉంగరాలు కూడా మార్చుకున్నారు. తర్వాత ఏమైందో ఏమోగానీ, వాళ్ళ పెళ్లి కేన్సిల్ అయింది. ఉదయ్, విషిత అనే అమ్మాయిని పెళ్ళాడగా, సుష్మిత విష్ణు ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. స్టార్ హీరోయిన్ నయనతార , హీరో శింబుల మధ్య ప్రేమాయణం నిశ్చితార్ధం వరకూ వెళ్ళింది. కానీ పెళ్లి ఎందుకో ఆగిపోయింది. అంతేకాదు, ప్రభుదేవాతో కూడా నయనకు ఇలాగే జరిగింది.
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ సిసింద్రీ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి, అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రేయ భూపాల్ తో నిశ్చితార్ధం జరిగాక కూడా ఎందుకో కేన్సిల్ అయింది. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ,కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం అయిన తర్వాత ఎందుకో పెళ్లి కేన్సిల్ అయింది. హీరో విశాల్ , గత ఏడాది అక్టోబర్ లో అనిషా రెడ్డితో నిశ్చితార్ధం చేసికున్నాక , పెళ్లి రద్దయింది. అలాగే స్టార్ హీరోయిన్ త్రిష, బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్ నిశ్చితార్ధం కూడా పెళ్లి పీటలు ఎక్కించలేకపోయింది.