కార్తీక దీపం సీరియల్ మలయాళంలో ఎలా ముగిసిందో తెలుసా…మరి తెలుగులో…?
karthika deepam serial Telugu :గత కొంతకాలంగా తెలుగు బుల్లితెరపై కార్తిక దీపం సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ మలయాళంలో వచ్చిన సీరియల్ కి రీమేక్ కావడం విశేషం. మలయాళంలో హిట్ అయిన ఈ సీరియల్ తెలుగు, తమిళ, కన్నడ ఇలా అన్ని భాషల్లో నడిచింది.
సస్పెన్స్ తో నడుస్తున్న ఈ సీరియల్ కి ముగింపు ఎలా ఉంటుందనే విషయంలో అందరికీ ఆసక్తి పెరిగింది. తెలుగులో దీపకు సవతి తల్లి ఉంటె, మలయాళంలో తండ్రి ఉంటాడు. ఇక తెలుగులో దీపకు ఇద్దరు కూతుళ్ళు ఉంటె, మలయాళంలో ఒక కూతురు ఉంటుంది. మలయాళంలో కార్తీక్ తమ్ముడు ఆదిత్య చనిపోతాడు. కార్తీక్ కి క్యాన్సర్ వచ్చి, విదేశాలకు వెళ్తాడు అదేసమయంలో గతం కోల్పోయిన దీప మళ్ళీ గుర్తుకి వచ్చి సౌందర్య దగ్గరకు వస్తుంది.
ఇక దీప కూతురు కలెక్టర్ అవుతుంది. తెలుగులో పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇద్దరు కవల పిల్లలను చూపించారు. దీప కూతురు కలెక్టర్ అవుతుందా, అసలు ఎలా ముగుస్తుంది అనేది చూడాలి. కార్తీక్, దీప ఎప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారా అని తెలుగు ఆడియన్స్ చూస్తున్నారు. మౌనిత బండారం బయటపడుతుందా, ఈ సీరియల్ ని తెలుగులో ఎలా మళ్లించి ముగిస్తారో ఆసక్తిగానే ఉంది.