కాలి చూపుడు వేలికి, మధ్య వేలికి టేప్ వేస్తె….ఏమి అవుతుందో తెలుసా?
Finger tapeing Benefits :ఈ మధ్య కాలంలో స్థూలకాయం, హై హీల్స్ వేసుకోవటం మరియు ఎక్కువసేపు నిల్చోవటం వంటి కారణాలతో ఎక్కువ మంది కాలి నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ బాధలు రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నొప్పుల నివారణకు పెయిన్ కిల్లర్స్,స్ప్రై వంటివి వాడకుండా ఒక చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది.
రిజిడ్ స్పోర్ట్స్ టేప్ (Rigid Sports Tape) అనేది మెడికల్, సర్జికల్ దుకాణాల్లో లభిస్తుంది. ఈ టేప్ 38 ఎంఎం మందం కలిగి చాలా స్టిఫ్ గా ఉంటుంది. అంతేకాక చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈ టేప్ ని తీసుకోని రాత్రి సమయంలో కాలి చూపుడు వేలికి, మధ్య వేలికి కలిపి ప్లాస్టర్లా వేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలో కాళ్ళు విశ్రాంతిగా ఉంటాయి.
ఈ ప్లాస్టర్ ని రాత్రి అంతా ఉంచి మరుసటి ఉదయం తీసేయాలి. ప్లాస్టర్ ని తరచుగా వేస్తూ ఉంటే సాధారణ కాళ్ళ నొప్పులు మరియు పాదాలపై పడే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది పాదాలు, కాళ్ల కింది భాగంలో అయిన గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది.అంతేకాక ఎక్కువ దూరం రన్నింగ్ చేసినా పాదాలపై ఒత్తిడి కలగకుండా ఉంటుంది.
ఏవైనా క్రీడలు ఆడుతున్న సమయంలో ఇలా టేపింగ్ చేసుకుంటే వేళ్లపై అదనపు ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇది గాయాలు కాకుండా కూడా నిరోధిస్తుంది. అయితే టేపింగ్ చేసిన క్రమంలో వేళ్లు వాపుకు గురవడం, ఎరుపుగా మారడం, దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫిజియోథెరపీ వైద్యున్ని సంప్రదించాలి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వైద్యుని సలహా మేరకే టేపింగ్ వేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.