మోనాల్ నిమిషానికి ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Monal Gajjar : బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులోకి వెళ్లకముందు మోనాల్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ ఏమీ లేకపోవడంతో తమిళం మలయాళం ఇండస్ట్రీ కి వెళ్ళిపోయింది అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత మరల అల్లరి నరేష్ తోనే బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమా చేసింది పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది.
బిగ్ బాస్ షో తర్వాత మోనాల్ రేంజ్ పెరిగిపోయింది బిగ్ బాస్ హౌస్ లో 98 రోజులు ఉంది ఇప్పుడు ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం 15 లక్షలు డిమాండ్ చేసిందట.పాట మూడు నిమిషాలు ఉంటుందట. అంటే నిమిషానికి ఐదు లక్షల అన్నమాట. మోనాల్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఏది ఏమైనా బిగ్ బాస్ తర్వాత మోనాల్ దశ తిరిగినట్టే.