Beauty Tips

Baldness:బట్టతల వచ్చాక బాధపడే కంటే – ముందు నుంచే ఈ టిప్స్ పాటించండి

Baldness Home Remedies in telugu:నడి వయసు రాకుండానే.. తలపై జుట్టు పలచపడిపోతోంది! పాతికేళ్లకే బట్టతల వచ్చేస్తోంది. దాంతో యువత మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే.. ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.

బిజీగా మారిన జీవనశైలి మరియు ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలు వంటి కారణాలతో జుట్టు రాలిపోయి బట్టతలగా మారుతుంది. ఈ రోజుల్లో మగవారిలో చిన్న వయస్సులోనే ఈ సమస్య మొదలు అవుతుంది. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బట్టతల సమస్య నుండి బయట పడటమే కాకుండా బట్టతల రాకుండా కూడా నివారించవచ్చు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

1. ఒక బౌల్ లో పాలు, కుంకుమ పువ్వు తీసుకోని బాగా కలిపి తలకు రాయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే రాలిన జుట్టు మరల పెరుగుతుంది.

2. నల్ల మిరియాల పొడిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి తలకు రాయాలి. ఇది బట్టతలను నివారించటంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నల్ల మిరియాలు జుట్టు కుడుళ్ళను బలంగా చేయటానికి సహాయపడుతుంది.

3. కొత్తిమీర రసాన్ని ప్రతి రోజు బట్టతల మీద రాస్తూ ఉంటే కొన్ని రోజులకు జుట్టు వస్తుంది.

4. కాఫీ గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో కొంచెం నీరు పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తలకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి.

5. మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.

6. ఎండబెట్టిన కరక్కాయ ముక్కలు, తానికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు పదింటిని తీసుకోని రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.

7. మందార పూలు, గోరింటాకు, కలబంద గుజ్జులను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని నల్ల నువ్వుల నూనెలో వేసి బాగా కషాయంలా కాయాలి. దీన్ని వడబోసి తలకు రాసుకోవాలి. ఈ విధంగా చేస్తే జుట్టు బాగా పెరగడమే కాకుండా నల్లగా మారుతుంది.

ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీకు లభ్యం అయినా వస్తువులను బట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలో ఉపయోగించిన వస్తువులు దాదాపుగా అన్ని చాలా సులువుగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u