కార్తీక దీపం వంటలక్కకు(ప్రేమి విశ్వనాథ్) ఎంత ఆస్తి ఉందో తెలుసా?
Karthika Deepam Premi Viswanath : స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యెకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఒకే ఒక సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యిపోయింది. చాలా మండి ఈ సీరియల్ ని వంటలక్క కోసం చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఈ మధ్యకాలంలో సిరియల్స్ తో పాటు యాడ్స్ కూడా చేయటం ప్రారంభించింది వంటలక్క.
బయట ఎక్కువగా కనిపించని ప్రేమి విశ్వనాథ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనపడుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సుతో వెనుక ఖరీదైన కారుతో దిగిన ఫొటో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో ప్రేమి విశ్వనాథ్ కి ఎంత అస్థి ఉందో అని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది.
సెలబ్రిటీల వయసు, ఆస్తుల వివరాలు తెలిపే ఓ వెబ్ సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో ఆమె ఆస్తులు రూ.36 కోట్లు ఉండొచ్చని అంచనా. ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు. కార్తీక దీపం సీరియల్ తో ప్రేమి విశ్వనాథ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.