తొడలు రాసుకుని ఎర్రగా కందితే…ఏమి చేయాలి?
Health Tips :చెమట ఎక్కువగా పట్టే వారికీ తొడలు రాసుకొని కందిపోవటం జరుగుతూ ఉంటుంది. వారికీ ఆ ప్రదేశంలో మంట పుట్టటం,ఎర్రగా కందిపోవటం జరుగుతుంది. వేసవి కాలంలో అయితే ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలు,చిట్కాలు,జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది.
* మంట పుడుతున్న ప్రదేశంలో వాజెలిన్ రాస్తే మంట మరియు దురద తగ్గుతుంది. దాంతో తొడలు రాసుకొనే సమస్య నుండి బయట పడవచ్చు.
* కొంచెం కలబంద గుజ్జును మంట పుడుతున్న ప్రదేశంలో రాస్తే మంట మరియు దురద తగ్గిపోతుంది.
* మంట, దురదగా ఉన్న తొడ భాగాల్లో కొంచెం కొబ్బరినూనెను రాసినా సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
* ఒక చిన్న నాప్కిన్ వంటి టవల్లో కొన్ని ఐస్ ముక్కలను వేసి ఆ టవల్ను చుట్టపెట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా కొంచెం సేపు అయ్యాక మళ్లీ రిపీట్ చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే సమస్య నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
* ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్కల లవంగం నూనెలను తీసుకుని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. 5 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల మంట, దురద వంటివి తగ్గి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* స్నానం చేసిన తరువాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని తీసుకుని తొడలు రాసుకునే చోట రాయాలి. ఆయిల్ పోయిందనుకుంటే మరల కొంచెం ఆయిల్ ని తీసుకుని రాయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
* టాల్కం పౌడర్ ను సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఆ సమస్య తొలగిపోతుంది. మంట, దురద కూడా తగ్గుతాయి. బయటికి వెళ్తున్నప్పుడు వీటిని వాడడం వల్ల ఫలితం ఇంకా బావుంటుంది.