Healthhealth tips in telugu

ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

Natural Hair Removal : అవాంచిత జుట్టును తొలగించటానికి వాక్సింగ్ పద్దతి ఉన్నప్పటికీ, సున్నితమైన ప్రాంతాలకు వచ్చేసరికి అది ప్రతికూలంగా మారుతుంది. మొటిమలు ఉంటే అవాంచిత జుట్టును తొలగించటం చాలా కష్టం అయ్యిపోతుంది. మధ్య ప్రాచ్యం నుండి మహిళలు కొన్ని శతాబ్దాలుగా సహజ నివారణలను ఉపయోగించి అవాంచిత జుట్టును తొలగిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి వివరంగా తెల్సుకుందాం.

పసుపు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. అలాగే చర్మ ఉపరితలం నుండి మృత కణాలు మరియు ఇతర మలినాలను తొలగిస్తుంది. శోషరస గ్రంథులు మరియు ఉపరితల రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.

పసుపులో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించటమే కాకుండా చర్మ PH స్థాయిలను స్థిరీకరణ చేస్తాయి. పసుపును మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు. లేదా పసుపు దుంపలను తెచ్చుకొని పొడిగా కూడా చేసుకోవచ్చు.

కావలసినవి
పసుపు – 1 స్పూన్
ముడిశెనగలు పొడి – 2 స్పూన్స్
పాలు లేదా పెరుగు – 1 స్పూన్

ఒక బౌల్ లో పసుపు,ముడిశెనగలు పొడి, పాలు లేదా పెరుగును వేసి బాగా కలిపి అవాంచిత జుట్టు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిముషాలు అయ్యిన తర్వాత రబ్ చేసి శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి పలితం
వస్తుంది.