MoviesTollywood news in telugu

శిల్పాశెట్టి వాచీ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే

Shilpa Shetty Watch Cost :హీరోలు అయితే కార్లు, బైక్ లు, షూస్, వాచీలు ఇలా రకరకాల ఖరీదైన వాటిని వాడుతుంటారు. హీరోయిన్స్ అయితే డ్రెస్ లకు ఎక్కువ వెచ్చిస్తారు. అలాగే హ్యాండ్ బాగ్ లు, వాచీలు వంటివాటిపై కూడా ఎక్కువే ఖర్చుచేస్తుంటారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సినిమాలతో పాటు అన్నట్టు యోగాసనాలు, టిక్ టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది.

సాహసవీరుడు సాగరకన్య మూవీతో వెంకటేష్ తో కల్సి నటించిన శిల్పాశెట్టి కూడా ఖరీదైన వస్తువులనే వాడుతుందని టాక్. తాజాగా ఆమె పెట్టుకున్న వాచీ మీద చర్చ నడుస్తోంది. మాములుగా 500, 1000రూపాయల వరకూ మాత్రమే వాచీ కోసం వెచ్చిస్తారు. మహా అయితే 5వేలు, 10వేలు కూడా ఖర్చు చేస్తారు. ఈమధ్య రెండు లక్షల రూపాయల వాచీలుకూడా కొందరు పెట్టుకున్నారు.

కానీ శిల్పా పెట్టుకున్న వాచీ ఖరీదు ఏకంగా 16లక్షల రూపాయలట. ఇంపోర్టెడ్ వాచీ కావడంతో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడారట. అయితే ఇంతసొమ్ము పెడితే సౌకర్యవంతమైన కారు వస్తుంది కదా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక నాగార్జునతో ఆజాద్, బాలయ్యతో భలేవాడివి బాసూ వంటి మూవీస్ లో నటించింది.