కూల్ డ్రింక్స్ మన శరీరానికి చేసే హాని గురించి తెలుసా…అసలు నమ్మలేరు
Cool Drinks Side Effects :సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటాం. కూల్ డ్రింక్ త్రాగటం వలన అప్పటికి ఏమి కాదు కానీ, లాంగ్ రన్ లో మాత్రం మన శరీరానికి హాని జరుగుతుంది. కూల్ డ్రింక్ వలన శరీరానికి కలిగే హాని గురించి తెలుసుకుందాం.
1. కూల్ డ్రింక్ లో దాదాపుగా 10 స్పూన్ల చక్కెర ఉంటుంది. మాములుగా ఇంత చక్కెర తీసుకుంటే వాంతులు అవుతాయి. కానీ డ్రింక్ లో ఫాస్పోరిక్ ఆమ్లం ఉండుట వలన వాంతులు అవ్వవు.
2. కూల్ డ్రింక్స్ వల్ల షుగర్స్ లెవల్స్ బాగా పెరిగిపోతుంది. దాంతో అది కొవ్వుగా మారి బరువు బాగా పెరుగుతాం.
3.కూల్ డ్రింక్స్ లో వుండే కెఫిన్ కారణముగా రక్త పోటు పెరుగుతుందట.
4.కూల్ డ్రింక్స్ వల్ల మూత్ర విసర్జన తో పాటు, డీహైడ్రేషన్ , దాహాం ఎక్కువగా వేస్తుంది.
5.కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో కాల్షియం లెవల్స్ బాగా తగ్గిపోయి ఎముకల సాంద్రత తగ్గుతుంది.
6. మధుమేహాం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
7.లివర్, గుండె సంబధిత వ్యాదులకు కారణాలలో కూల్ డ్రింక్స్ ఒకటి.
కూల్ డ్రింక్స్ తాగటం వలన మన శరీరానికి హాని కలుగుతుంది. కానీ ఈ వేసవిలో కూల్ డ్రింక్స్ తాగటానికి బదులు పండ్ల రసాలు తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/