MoviesTollywood news in telugu

ఈ భామ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

Telugu Actress Shraddha Srinath :ఈ కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ జెర్సీ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించింది. ఆ సినిమాలో ఒక బిడ్డకు తల్లిగా నటించడంతో అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ఈ అమ్మడు గ్లామర్ కంటే పర్ఫామెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో స్టార్ హీరోల సరసన చాన్సు రాలేదు.

తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ట్రాక్ మార్చి తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ భామ దూసుకుపోతోంది. మూడు సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉండగా ఐదు సినిమాలు సైన్ చేసింది ఈ ఏడాదిలో 8 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది తెలుగు దర్శకులు చిన్న చూపు చూసిన మిగిలిన మూడు బాషల్లో దూసుకుపోతుంది.