నెంబర్ వన్ కోడలు సీరియల్ నటి ప్రీతి ఎన్ని సినిమాల్లో నటించిందో…?
No 1 kodalu serial actress preethi :తెలుగులో సినిమాలకు ధీటుగా సీరియల్స్ కి ఆదరణ ఉండడంతో ధారావాహికంగా సీరియల్స్ రన్ అవుతున్నాయి. కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తు న్నాయ్. ఇక నెంబర్ వన్ కోడలు సీరియల్ జి తెలుగులో ప్రసారమవుతోంది. సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇందులో నటిస్తున్న ప్రీతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది ఆడియన్స్ కి దగ్గరైంది.
తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్న ప్రీతి అసలుపేరు ఉషా వైభవి. బెంగళూరులో ఏప్రియల్ 5న జన్మించింది. ఈమెకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఎంబీఏ చేసిన ప్రీతి నటనపై ఆసక్తి లేకుండానే అనుకోకుండా స్టడీస్ టైం లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు కన్నడ సినిమాల్లో నటించిన ఈమె దుర్గ అనే కన్నడ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రీతికి డాన్స్ అంటే ఇష్టం. డ్రాయింగ్, పెయింటింగ్ అంటే కూడా ఈమెకు చాలా ఇష్టం. గోరింటాకు సీరియల్ లో నటిస్తున్న కావ్యశ్రీతో కల్సి కన్నడ సీరియల్ లో ప్రీతి నటించింది. లక్ష్మీ కళ్యాణం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సీరియల్ లో స్వాతిగా నటించి, ఆడియన్స్ ని అలరించింది. ఇప్పుడు నెంబర్ వన్ కోడలు సీరియల్ లో తన నటనతో మెప్పిస్తోంది.